NTV Telugu Site icon

ఇమార్టికస్‌ లెర్నింగ్‌తో కేఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ అవగాహన ఒప్పందం

Kl University 01

Kl University 01

KL Deemed University ties up with Imarticus Learning

గ్రాడ్యుయేషన్‌ మరియు హయ్యర్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం దేశంలో అగ్రగామి యూనివర్శిటీలలో ఒకటైన కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ, తాము దేశంలో సుప్రసిద్ధమైన మరియు భారతదేశంలో అగ్రగామి ఎడ్‌ టెక్‌ కంపెనీలలో ఒకటైన ఇమార్టికస్‌ లెర్నింగ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా అసాధారణ రీతిలో ఫిన్‌టెక్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేయనున్నారు. కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ ఈ భాగస్వామ్యంపై ఆధారపడి ప్రపంచశ్రేణి అభ్యాస అనుభవాన్ని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫైనాన్షియల్‌ టెక్నాలజీ విద్యారంగంలో సృష్టించనుంది. ఈ అవగాహన ఒప్పందంను హైదరాబాద్‌లో చేసుకోవడంతో పాటుగా ఫిన్‌టెక్‌ విభాగంలో సాటిలేని వ్యాపార విద్యను సంయుక్తంగా తీర్చిదిద్దనున్నారు.

ఇమార్టికస్‌, బెంగళూరు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ అహ్మద్‌ ఖాలీద్‌ మాట్లాడుతూ తొలి బ్యాచ్‌లో 60 మంది విద్యార్థులను క్యాంపస్‌లోకి తీసుకోనున్నామన్నారు. ఈ కోర్సును పూర్తిగా, మరియు ప్రత్యేకంగా బ్లాక్‌చైన్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డాటా మొదలైన కీలకమైన సాంకేతికతల పట్ల ఆసక్తి, నేర్చుకోవాలన్న తపన ఉన్నవారికి మాత్రమే పరిమితం చేయనున్నారు.

వాంటేజ్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ ఇటీవల విడుదల చేసిన అధ్యయనాల ప్రకారం, ఫిన్‌టెక్‌ మార్కెట్‌ పరిమాణం 2021వ సంవత్సరంలో 112.5 బిలియన్‌ యుఎస్‌డీగా ఉంది. ఇది 2028 నాటికి 332.5 బిలియన్‌ యుఎస్‌డీకి చేరుకుంటుందని అంచనా. పరిశ్రమలో సుప్రసిద్ధమైన పలు సంస్థలు అయినటువంటి కేంబ్రిడ్జ్‌, వరల్డ్‌ బ్యాంక్‌లు సైతం ఫిన్‌టెక్‌ రంగం యొక్క వ్యాప్తిని గుర్తించాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు ఆరోగ్య, ఆర్ధిక అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఇది వ్యాప్తి చెందుతుందని వెల్లడించాయి. కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ ఇప్పుడు ఈ అత్యధిక ప్రయోజనాలను అందించే కెరీర్‌ ఎంపికలను విడుదల చేసింది. అత్యధిక వేగంతో వృద్ధి చెందుతున్న ఈ డిమాండ్‌ను అందుకోవడానికి అంతే సంఖ్యలో ఫిన్‌టెక్‌ నిపుణుల అవసరం కూడా పెరుగుతుంది. ఇమార్టికస్‌ నుంచి స్వీకరించిన నూతన బోధనా పద్ధతులు అంటే లీనమయ్యేలా ప్రత్యక్ష తరగతులు, హైబ్రిడ్‌ లెర్నింగ్‌ మాడ్యుల్స్‌, పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని సెమినార్లు, కాప్‌స్టోన్‌ ప్రాజెక్ట్స్‌, గెస్ట్‌ లెక్చర్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ వంటివి ఇతర వినూత్న పద్ధతులను స్వీకరించనుంది. ఈ కొత్త కోర్సుతో పాటు, KL విశ్వవిద్యాలయం పబ్లిక్ పాలసీలో MBAని కూడా ప్రారంభిస్తోంది, నేటి విద్యాసంబంధమైన ప్రకృతి దృశ్యంలో అయస్కాంత ఆసక్తిని కలిగి ఉన్న మరొక క్షేత్రం.

ఈ వినూత్నమైన ప్రోగ్రామ్‌ ద్వారా ఫిన్‌టెక్‌లో ప్రతి అంశాన్నీ కవర్‌ చేయనున్నారు. దీని కరిక్యులమ్‌ను ఫిన్‌టెక్‌ రంగంలో ప్రతి కీలకాంశాన్నీ స్పృశించడంతో పాటుగా లోతైన అవగాహన కల్పించే రీతిలో తీర్చిదిద్దారు.

‘‘సాధారణ ఎంబీఏ లా కాకుండా ఇది జెనరిక్‌ మేనేజ్‌మెంట్‌ ప్రిన్సిపల్స్‌, విస్తృతస్థాయి స్పెషలైజేషన్లుపై దృష్టి సారిస్తుంది. ఈ ప్రత్యేకమైన ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా పరిశ్రమలో ఉన్న నైపుణ్య అంతరాలను పూరించే రీతిలో రూపొందించాము’’ అని డాక్టర్‌ ఎం. రామకృష్ణ, డైరెక్టర్‌, కొండాపూర్‌ క్యాంపస్‌, కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ అన్నారు.

Kl University

ఈ వినూత్నమైన అభ్యాసంతో అభ్యాసకులు తాజా ధోరణులు, ప్రక్రియల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటుగా నిత్యం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమను పునర్నిర్వచించే అంశాల పట్ల కూడా మెరుగైన అవగాహన కనబర్చగలరు.

విద్యపరంగా అత్యున్నత విజయాలను సాధించడానికి చేస్తోన్న ప్రయత్నాలను అనుసరిస్తూ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ర్యాంకింగ్స్‌ 2022లో అసాధారణ వృద్ధిని అంచనా వేసిన వెంటనే ఈ భాగస్వామ్యాన్ని యూనివర్శిటీ ప్రకటించింది. ఈ ఫలితాలలో కెఎల్‌ యూనివర్శిటీ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ యూనివర్శిటీ విభాగంలో టాప్‌ ర్యాంకింగ్స్‌లో ప్రవేశించింది. దేశంలో టాప్‌ 100 యూనివర్శిటీలలో 27వ ర్యాంక్‌ను యూనివర్శిటీ సాధించింది.

ఈ ఎంఓయుపై సంతకం చేసిన కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్‌, హ్యుమానిటీస్‌ , సైన్స్‌ విభాగాల డీన్‌ డాక్టర్‌ ఏ కిశోర్‌ బాబు మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లోని కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ ఈ భాగస్వామ్యంను ఇమార్టికస్‌ లెర్నింగ్‌తో చేసుకుని వినూత్నమైన ఎంబీఏ ప్రోగామ్‌ను ఫిన్‌టెక్‌లో అందించనుందని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్‌ మా ప్రతిభావంతులైన టెక్‌ యువతకు నూతన ప్రాంగణాలను అందించడంతో పాటుగా అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ సాంకేతిక రంగంలో మెరుగైన కెరీర్‌లను సొంతం చేసుకునే అవకాశం కూడా అందిస్తుంది. కెఎల్‌ యూనివర్శిటీ ,తమ విద్యార్థుల కోసం అత్యుత్తమమైన విద్యను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, ఫిన్‌టెక్‌ డొమైన్‌లో అసాధారణ అభ్యాస అనుభవాలను అందించేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

అత్యున్నత సంస్ధలైనటువంటి గోల్డ్‌మెన్‌ శాచ్స్‌, క్యాప్‌జెమిని, ఈ అండ్‌ వై, టెక్‌ మహీంద్రా, ట్రాన్స్‌ఆర్గ్‌ ఎనలిస్ట్‌, గెయిన్‌ ఇన్‌సైట్‌ మరియు టీమ్‌ కంప్యూటర్స్‌ ఈ తరహా భాగస్వామ్యాల నుంచి వచ్చే ప్రతిభను గుర్తిస్తున్నాయి.

ఇమార్టికస్‌ లెర్నింగ్‌ ఫౌండర్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ నిఖిల్‌ బర్షికర్‌ మాట్లాడుతూ ‘‘కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ, హైదరాబాద్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. విద్యారంగంలో వైవిధ్యత పరంగా సుప్రసిద్ధమైన యూనివర్శిటీలలో ఇది ఒకటి. దీర్ఘకాలం పాటు వీరితో కలిసి పనిచేయడం ద్వారా విద్యార్థులకు అసాధారణ అభ్యాస అనుభవాలను అందించగలమని భావిస్తున్నాము’’ అని అన్నారు.

కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ గురించి :
కెఎల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌గా 1980లో ప్రారంభమైన కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ నేడు తమతో పాటుగా 40 సంవత్సరాలకు పైగా విద్యా వారసత్వం తీసుకువచ్చింది. 2009లో ఇది డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీగా మారింది. ఏ++ గ్రేడ్‌తో నాక్‌, కేటగిరి –2 సంస్థగా యుజీసీ, ఎంహెచ్‌ఆర్‌డీ, భారతప్రభుత్వంలు 2019లో గుర్తించాయి. భారతదేశంలో అత్యున్నత యూనివర్శిటీలలో 27 వ ర్యాంకును ఇది ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2022 ర్యాంకింగ్స్‌లో పొందింది.

విజయవాడలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ ఉంది. హైదరాబాద్‌లోనూ సంస్థకు ఓ ప్రపంచశ్రేణి క్యాంపస్‌ ఉంది. ఈ యూనివర్శిటీ ఇప్పుడు 16 దేశాలలోని 80కు పైగా విదేశీ యూనివర్శిటీలతో ఒప్పందాలు చేసుకుని విద్యార్థులకు అంతర్జాతీయ అవగాహనను ఇంటర్న్‌షిప్స్‌, ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా అందిస్తుంది. యూనివర్శిటీ వద్ద ఇంటెలెక్చువల్‌ రిసోర్స్‌లో 1200కు పైగా ఫ్యాకల్టీ సభ్యులు సైతం ఉన్నారు. వీరిలో 600కు పైగా ఫ్యాకల్టీ సభ్యులు పీహెచ్‌డీ స్కాలర్లు. ఇప్పటి వరకూ ఈ సంస్ధ సుప్రసిద్ధ కంపెనీలలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌లను అందించిన మహోన్నతమైన రికార్డ్‌ ఉంది. దాదాపు 50వేల మందికి పైగా మా అల్యూమ్ని సమాజం, దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా విభిన్న రంగాలలో అసాధారణ తోడ్పాటును అందిస్తున్నారు.