NTV Telugu Site icon

KKR vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్

Ipl

Ipl

KKR vs SRH: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. కానీ, అప్పటి నుండి వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. మరోవైపు అజింక్య రహానే నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. ఇరు జట్లు చివరి మ్యాచ్ లో ఓడిపోవసంతో ఈ మ్యాచ్ ఇరుజట్లకూ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌. దీనితో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మొదట బ్యాటింగ్ చేపట్టనుంది. ఇక నేటి మ్యాచ్ ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలను చూద్దాం.

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్లేయింగ్ XI జట్టు:
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకూ సింగ్, అంక్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రిజర్వ్ ఆటగాళ్లు:
మనీష్ పాండే, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, రోవ్‌మాన్ పావెల్, లవ్నిత్ సిసోడియా

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హైన్‌రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమీ, జీషాన్ అన్సారి

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రిజర్వ్ ఆటగాళ్లు:
అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, ట్రావిస్ హెడ్, రాహుల్ చహర్, వియన్ ముల్డర్