Site icon NTV Telugu

KKR vs MI: ముంబై ఘోర పరాభవం.. ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా..

Kkr

Kkr

కోల్‌కతా నైట్ రైడర్స్ 2024 ఐపిఎల్ సీజన్‌లో తమ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించింది. తొమ్మిదో విజయంతో ప్లేఆఫ్స్‌ లోకి అధికారికంగా ప్రవేశం అయినట్లే. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్ కి మరో ఓటమి ఎదురైంది. ఈడెన్ గార్డెన్స్‌ లో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు కోల్‌కతా 18 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. వర్షం కారణంగా ఆలస్యమైన ప్రారంభం తర్వాత 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విజయాన్ని అందుకుంది. దింతో పాయింట్స్ టేబుల్ లో శ్రేయాస్ అయ్యర్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై మరో ఓటమిని చవిచూసింది.

Also Read: Rajamouli : నా కెరీర్ లో ఆ సినిమా చేసిన మ్యాజిక్ ఎప్పటికి మర్చిపోలేను..

16 ఓవర్లలో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఫీల్డ్‌ లో రాణించలేకపోయాడు. కలకత్తా బౌలర్లకు బానిసలయ్యారు. ముంబై ఇండియన్స్ 16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే కాస్త దూకుడుగా ఆడాడు. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడినా కిషన్ చెలరేగి ఆడాడు. అయితే ఏడో ఓవర్‌లో కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ చేతిలో ఔటయ్యాడు. దీంతో తొలి 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ (24 బంతుల్లో 19 పరుగులు) ఆ తర్వాతి ఓవర్ లోనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Also Read: Snakes on a plane: వీడెవడండీ బాబు.. ఏకంగా అనకొండలను రవాణా చేస్తున్నాడు..

దీని తర్వాత ముంబై స్ట్రైకర్ సూర్యకుమార్ యాదవ్ కూడా (14 బంతుల్లో 11 పరుగులు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) మళ్లీ విఫలమయ్యారు. 12వ ఓవర్లో హార్దిక్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. రస్సెల్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ (0) వచ్చిరాగానే వేణు తిరిగాడు. యంగ్ స్టార్ తిలక్ వర్మ (17 బంతుల్లో 32) కాసేపు ప్రయతించాడు. అయితే అటువైపు నుంచి ఎలాంటి సహకారం అందలేదు. చివరి ఓవర్లో తిలక్ కూడా ఔటయ్యాడు. నమన్ ధీర్ (6 బంతుల్లో 17 పరుగులు) కాసేపు రాణించినా ఫలితం లేకపోయింది. కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యాను, రోహిత్ శర్మ అవుట్ చేశాడు. ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీశారు. సునీల్ నరైన్‌కు ఒక వికెట్ దక్కింది.

Exit mobile version