ఐపిఎల్‌లో సిక్సర్స్ ఛాంపియన్‌గా పేరుగాంచిన ఆండ్రూ రస్సెల్ ప్రస్తుత ఐపిఎల్ 17వ సీజన్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున తన మార్క్ ను చూపిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఆండ్రూ రస్సెల్ కొత్త అవతారం ఎత్తాడు. తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రస్సెల్ ఓ ఆల్బమ్ లో గాయకుడిగా, నటుడిగా కనిపించాడు.
Also read: KL Rahul: లక్నో కెప్టెన్‌గా తప్పుకుంటున్న కేఎల్ రాహుల్.. 2025లో రిటైన్ కూడా కష్టమే!
రస్సెల్, చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ నటించిన ఈ పాట యొక్క టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వారంతా ‘రస్సెల్ నీలో కూడా ఆ టాలెంట్ ఉందా..? రస్సెల్, అవికా కలిసి చేసిన ‘లడికీ తు కమాల్’ ఆల్బమ్ ను గురువారం విడుదల చేశారు. రస్సెల్ లుంగీ ధరించి తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. అవిక నీలిరంగు చీరలో దేదీప్యమానంగా కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రస్సెల్ బాలీవుడ్ పాటలను ఇష్టపడతాడు. “డంకీ” చిత్రంలోని “రుట్ పుట్ గయా” పాటను రస్సెల్ హమ్ చేయడం వారి టీమ్ యజమాని షారూఖ్ ఖాన్ తరచుగా వింటాడు. బాలీవుడ్ ట్రెండ్‌ను అనుసరించి, రస్సెల్ తన కొత్త ఆల్బమ్ విడుదల చేస్తున్నాడు. గతంలో విండీస్ మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావోలు కూడా తమ బాలీవుడ్ షోలు, ఆల్బమ్ లతో సంచలనం సృష్టించారు.
Russell making his debut in Bollywood as singer and also featuring in the song 🔥
Bro took the tag of Allrounder seriously 👹👊🏻 pic.twitter.com/lS33KkgIbq
— Aditya. (@Hurricanrana_27) May 7, 2024