NTV Telugu Site icon

IPL 2024 Final: ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి.. విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్!

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

SRH Clinches Kite Festival 2024, RCB as Runner-Up: ఇండియన్ పతంగ్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో హైదరాబాద్ పైచేయి సాధించింది. దాంతో ఇండియన్ పతంగ్ లీగ్ 2024 విజేతగా హైదరాబాద్ నిలిచింది. మకర సంక్రాంతి మరియు లోహ్రీ శుభ సందర్భంగా ప్రముఖ క్రీడా ఛానెల్ ‘స్టార్ స్పోర్ట్స్’ గాలిపటాల పోటీని అహ్మదాబాద్‌లో నిర్వహించింది. ఈ పోటీలో ఐపీఎల్ జట్ల అభిమానులు పోటీపడ్డారు.ఇక్కడ విశేషం ఏంటంటే.. 2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌లో బెంగళూరు, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి.

ఐపీఎల్ 2024 మార్చి 24 నుంచి ఆరంభం కానుందని తెలుస్తోంది. షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే షెడ్యూల్‌పై కసరత్తు మొదలెట్టిందట. గత డిసెంబర్‌లో ఐపీఎల్ 2024కు సంబందించిన వేలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ వేలంలో హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగాలను కొనుగోలు చేసింది. వేలంలో ఆస్ట్రేలియా పేసర్‌ను 20.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం గమనార్హం. ఇప్పటికే జట్టులో ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిక్ క్లాసెన్ లాంటి స్టార్స్ ప్లేయర్స్ ఉన్నారు.

Also Read: Indore T20 Records: ఇండోర్‌లో టీమిండియా రికార్డులు అదుర్స్.. అఫ్గానిస్థాన్‌కు చుక్కలు తప్పవా?

మరోవైపు వేలంలో బెంగళూరు కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంది. వేలానికి ముందు ఏస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, స్పిన్నర్ వనిందు హసరంగాలను విడుదల చేసింది. వేలంలో మిచెల్ స్టార్క్ కోసం వెళుతుందనుకున్నా అది జరగలేదు. అల్జారీ జోసెఫ్ కోసం 11.50 కోట్లు ఖర్చు పెట్టింది. విదేశీ పేసర్‌లుగా లాకీ ఫెర్గూసన్, టామ్ కుర్రాన్‌లు ఉన్నారు. బెంగళూరు ఇంకా టైటిల్ గెలవకపోవడానికి కారణం బలహీనమైన బౌలింగ్ అని నిపుణులు అంటున్నారు.