Site icon NTV Telugu

Kishan Reddy: బీఆర్ఎస్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కి కిషన్ రెడ్డి ఫిర్యాదు

Kishanreddy On Ec

Kishanreddy On Ec

బీఆర్ఎస్ అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నారు అని దానికి పోలీసులు సహకరిస్తున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలంగాణ బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కి కిషన్ రెడ్డి కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో వంద నుంచి రెండు వందల మంది బీఆర్ఎస్ నేతలు గుమ్మి గుడుతున్నారని కంప్లైంట్ లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని అధికారుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చాలా నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ నేతలకు అధికారులు పరోక్ష సహకారం అందిస్తున్నారు అంటూ ఆయన ఫిర్యాదులో వెల్లడించారు. అంబర్ పేట లో బీఆర్ఎస్ అభ్యర్థి తనయుడు డబ్బులు పంచిన అతడిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారంటూ కిషన్ రెడ్డి కంప్లైంట్ చేశారు.

Exit mobile version