మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్ అవుతోంది. అధికార టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే వుంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై భగ్గుమన్నారు. పోలీసులు ఏకపక్షంగా పనిచేయవద్దు. అవసరమైతే కేంద్ర బలగాన్ని దించుతాం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు పద్ధతులు మార్చుకోకపోతే కేంద్ర బలగాలని దించాల్సి వస్తుందని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య సభ వ్యవహారంలో పోటీ పడటంతో ఉద్రిక్తత కొనసాగింది.
Read Also: Bandi Sanjay: నేడు మునుగోడుకు బండి సంజయ్.. 12 రోజుల పాటు రోడ్ షో
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీలు ప్రతిష్టాత్మకం అవుతున్నాయి. సభలు పెట్టుకునే వ్యవహారంలో కూడా రాజీపడటం లేదు. తాజాగా జరుగుతున్న ఘటనలు దాన్ని స్పష్టం చేస్తున్నాయి. మునుగోడు మండలంలోని పలివెల గ్రామంలో జరిగిన ఘటన వారి మధ్య పోరు ఎంత స్థాయిలో ఉందో స్పష్టం చేస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడుకి చేరుకున్నారు. అక్కడి నుంచి పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పలివెల గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు చేరికల కార్యక్రమం పెట్టుకున్నారు. అదే సందర్భంలో అదే గ్రామానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. అయితే కిషన్ రెడ్డి సభల గురించి ముందే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు.
తాము అనుమతి తీసుకున్న సమయంలోనే టీఆర్ఎస్ కు ఎలా అనుమతిస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇటు కిషన్ రెడ్డి ర్యాలీ గ్రామంలోకి రాగా అదే సందర్భంలో అదే జంక్షన్లో టీఆర్ఎస్ కళాజాత కూడా కొనసాగుతుంది. పోలీసులు ఎంత నచ్చజెప్పినప్పటికీ టీఆర్ఎస్ కళాజాత అక్కడి నుంచి వెళ్లిపోవటానికి ససేమిరా ఇష్టపడలేదు. దీంతో కిషన్ రెడ్డి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని మునుగోడు సభలో స్పష్టం చేస్తూ పోలీసులు ఒక వర్గానికి అనుకూలంగా పనిచేయవద్దని అవసరమైతే కేంద్ర బలగాలని కూడా దించటానికి వెనకడుగు వేసే సమస్య లేదని కిషన్ రెడ్డి హెచ్చరికలు చేశారు. మొత్తం మీద మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
Read Also: Snake Venom: డార్జిలింగ్‌లో 2.5కేజీల పాము విషం పట్టివేత.. విలువ రూ.30కోట్లు