Kishan Reddy: కర్ణాటకలో కాంగ్రెస్ నీ గెలిపించిన ప్రజలు తలలు పట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెబుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చర్చించి బీజేపీ పక్షనేతను నిర్ణయిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఫైళ్ళ మాయం పైన ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలన్నారు. గత మూడు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి పై ఐటి అధికారుల దాడులు జరగాయన్నారు. దేశం మొత్తం విస్తు పోయేలా 290 కోట్లు దొరికాయన్నారు. ఇప్పటి వరకు 40కి పైగా సంచులు లెక్క బెట్టారని అన్నారు. ఇంకా 90 కి పైగా సంచులు లెక్కబెట్టల్సి ఉందన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఎక్కడా ఇంత పెద్ద అమౌంట్ దొరకలేదన్నారు. ఆ డబ్బును లెక్క బెట్టడనికి కౌంటింగ్ మిషన్స్ కూడా సరిపోవడం లేదన్నారు. ఎలక్షన్ కమీషన్ కి చూపించిన ఆస్తి చాలా తక్కువ అన్నారు. కానీ ఇక్కడ లెక్కబెట్టలేని సంపద దొరకడం చూస్తే ఎంత అవినీతి చేస్తున్నారో అర్థం అవుతుందని తెలిపారు.
Read also: Acid Attacks: ఈ నగరంలోనే మహిళలపై ఎక్కువ యాసిడ్ దాడులు జరిగాయి..
అతని వద్ద ఉన్న దస్తావేజులు అక్కడ ఉన్న దన్నుకు పొంతన లేకుండా ఉందని తెలిపారు. ఇంకా వివిధ బ్యాంకులలో 7 కు పైగా లాకర్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. అక్రమ సంపాదనకు సంబందించిన వివరాలు ఉన్న కంప్యూటర్స్ అల్మరలో గుర్తించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న ధీరజ్ సాహు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయినా కూడా ధీరజ్ సాహు ను మూడు సార్లు రాజ్యసభ ఎన్నుకున్నారని వ్యంగాస్త్రం వేశారు. ధీరజ్ సాహు పై ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో కూడా అవినీతికి పాల్పడి కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా ఉన్న వ్యక్తులే తీహార్ జైల్లో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసే ముఖ్య మంత్రులను, ఎంపీ లను ఏటిఎం లు గా మార్చుకుందని తెలిపారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారం లో ఉంటే అక్కడ అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని తెలిపారు.
Read also: Revanth Reddy: త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలి.. కేసీఆర్ ను సీఎం రేవంత్ పరామర్శ
కాంగ్రెస్ పార్టీ దేశ ఆర్థిక వ్యవస్థను చెదలు పట్టినట్టుగా తోలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్న రాష్ట్రం నుండి వందల కోట్లు తెలంగాణ ఎన్నికలకు తరలిస్తూ పట్టుబడటం చూశామన్నారు. ధీరజ్ సాహు లాగే కర్ణాటక లో మరో నాయకుడు నుండి ఈ డబ్బు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కర్ణాటకలో ఆరు నెలలు పూర్తి కాక ముందే కాంగ్రెస్ దోపిడీ కి పాల్పడుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ దోపిడీకి భయపడి అక్కడ బిల్డర్స్ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కి ఇదొక ఉదాహరణ అని చెప్పుకోవచ్చని తెలిపారు. నరేంద్ర మోడీ అవినీతి నీ కట్టడి చేసేందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ తెచ్చాడని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్ దేశంలో జరిగాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నీ గెలిపించిన ప్రజలు తలలు పట్టుకుంటున్నారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. మరొక సారి ప్రజలు బిజెపి కి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.
Bank Robbery: 15ఏళ్లలో 7 సార్లు బ్యాంకులో చోరీకి దొంగల యత్నం.. ప్రతి సారీ కుక్కలే పరిగెత్తించాయి