NTV Telugu Site icon

Kishan Reddy: 15 కొత్త ప్రాజెక్టులు, ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్రప్రభుత్వం ఓకే చెప్పింది

Kishan Reddy

Kishan Reddy

దేశవ్యాప్తంగా ఈశాన్యరాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు మినహా.. మైదాన ప్రాంతాల్లో అతితక్కువ రైల్వే నెట్‌వర్క్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 ఏళ్లలో తెలంగాణలో రైల్వేవ్యవస్థను అభివృద్ధి చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో, పూర్తిస్థాయిలో జరగలేదని ఆయన తెలిపారు. 66 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీరియస్ గా ప్రయత్నాలేమీ జరగలేదని ఆరోపించారు. వెంటవెంటనే ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు సంపూర్ణంగా మోడీ ప్రభుత్వం కృషిచేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా అందించాల్సిన తమవంతు సహకారాన్ని అందించడం లేదని కిషన్ రెడ్డి అన్నారు.

Gold Seized: ఇండో- బంగ్లాదేశ్ బార్డర్లో భారీగా బంగారం పట్టివేత

ఎంఎంటీఎస్, ఇతర రైల్వే విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. రైల్వే కనెక్టివిటీలో భాగంగా హైదరాబాద్- యాదాద్రి లైన్ మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రతి యేటా 55 కిలోమీటర్లు రైల్వే లైన్ వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ స్వంయంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ప్రారంభించారని కిషన్ రెడ్డి తెలిపారు. 2022లో తెలంగాణ ప్రభుత్వం, నిర్లక్ష్యం సహాయ నిరాకరణ కారణంగా.. దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు నిలిచిపోయాయని కిషన్ రెడ్డి తెలిపారు. దాదాపు 15 కొత్త ప్రాజెక్టులకు (న్యూ లైన్స్ కోసం) ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) కు కేంద్రప్రభుత్వం ఓకే చెప్పిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా 8 డబ్లింగ్ లైన్లకు, 3 ట్రిప్లింగ్ లైన్లు, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు పచ్చజెండా ఊపిందని.. ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయన్నారు. సర్వే పూర్తవగానే DPR ల పనులు ప్రారంభిస్తారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Vangaveeti Radha: ఘనంగా నిశ్చితార్థ వేడుక.. అక్టోబరు 22న పెళ్లి పీటలు ఎక్కనున్న రాధా

ఈ ఫైనల్ లొకేషన్ సర్వేలో 15 కొత్త ప్రాజెక్టులు, 15 అదనపు లైన్ల ప్రాజెక్టులు మొత్తం 30 ప్రాజెక్టులు చేపట్టనున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మొత్తం ప్యాకేజీ విలువ రూ.83,543 కోట్లు అని మంత్రి తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో ప్రాజెక్టులు చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం మొదటిసారన్నారు. రాష్ట్రం సహకరించకపోయినా.. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం, వారి సౌలభ్యం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని కిషన్ రెడ్డి తెలిపారు.