Site icon NTV Telugu

Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు.. ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నాయి

Kishanreddy

Kishanreddy

రేపు ఉదయం నారాయణపేట సభలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సభలో మోడీ పాల్గొంటారని, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు.. ఎన్నికల సందేశాన్ని ఇస్తారని ఆయన పేర్కొన్నారు. బట్టకాల్చి మొహం మీద పడేసే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు అని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు అని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ మాటలు ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు.. నవ్వుకుంటున్నారని, గాడిద గుడ్డు ప్రచారం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అవుతుంది.. తెలంగాణ ప్రజలెవరూ దాన్ని పట్టించుకోవడం లేదని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

అంతేకాకుండా..’హైకమాండ్ ఆదేశాలతో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలను కలిసాం.. ఎన్ని తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేసిన నాకు ఢోకా లేదు.. అండర్ కరెంట్, ఓపెన్ కరెంట్ ఉంది.. ప్రజలు బీజేపీకె ఒకేస్తామని చెప్తున్నారు.. మాకు తెలంగాణకు ఇది కీలకమైన సభ.. 5 పార్లమెంట్ నియోజవర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ సభలో పాల్గొంటారు.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు, యూత్ అందరు సభకు రావాలి.. మోడీకి మనమంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.. ఏ ఫ్రంట్ కూడా మోడీకి ప్రత్యామ్యయంగా లేదు.. కాంగ్రెస్ కు విమర్శించడానికి ఏం లేదు.. కాబట్టి దుష్ప్రచారాలు చేస్తుంది.. రిజర్వేషన్స్ అంశమపైన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసింది.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలను ఏ ఒక్కరు సీరియస్ గా తీసుకోవడం లేదు.. రిజర్వేషన్స్ అంశంపై డైరెక్ట్ చేసిన రాహుల్ గాంధీ సినిమా ఫ్లాప్ అయ్యింది.. సెకండ్, థర్డ్ ప్లేస్ వస్తుందని రేవంత్ రిజర్వేషన్స్ అంశాన్ని ప్రచారం చేస్తున్నారు.. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం..’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version