NTV Telugu Site icon

Kishan Reddy : మహిళలకు అనేక రకాల ఉపాధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్‌లో జేసిఐ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్ యంత్రాలను పంపిణీ చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 100 కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని, గత కొన్నేండ్ల క్రితం నేను అంబర్​ పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్కిల్​ డెవలప్​ సెంటర్లు.. ఇప్పుడు సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విస్తరించాయన్నారు. మహిళలకు అనేక రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు వారి కాళ్ల మీద వారి నిలబడాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్లు అందజేస్తున్నామని, పేద, మధ్య తరగతి మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు మేము కృషి చేస్తున్నాం.

Allu Arjun: మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి అల్లు అర్జున్

స్టార్టప్​ లు, ముద్ర రుణాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు కిషన్‌ రెడ్డి. గ్రామీణ ప్రాంతంలో మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇప్పించి.. వ్యవసాయంలో వాటిని వాడుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ‘డ్రోన్​ దీదీ’ పేరిట కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 15 వేల గ్రామాల్లో పైలెట్​ ప్రాజెక్టు కింద శిక్షణ ఇచ్చి 15 వేల డ్రోన్లు ఇచ్చాం. అన్ని బ్యాంకులకు కూడా మోదీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ముద్ర బ్యాంకు, స్వనిధి యోజన, స్వయం సహాయక సంఘాలకు లక్షల రూపాయల లోన్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. – మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు ఈ సమాజం బాగు పడుతుంది. ఆ దిశగా మేము చర్యలు తీసుకుంటున్నామని కిషన్‌ రెడ్డి తెలిపారు.

Swallows Set of Teeth : నిద్రలో ప‌ళ్ల సెట్ మింగేసిన వ్యక్తి.. ఆ తరువాత..!

Show comments