ప్రసాద్ ల్యాబ్స్ లో ది సబర్మతి రిపోర్ట్ సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2002 గుజరాత్ గోద్రాలో అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులను సబర్మతి ఎక్స్ ప్రెస్ లో కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం కాల్చి 59 మందిని హత్య చేశారని ఆయన అన్నారు. దీనిపై అనేక చర్చలు వాదోపవాదాలు జరిగాయని, చివరకు నానావతి కమిషన్ దీన్ని ప్రమాదం కాదని, ప్రీ ప్లాన్ గా కొన్ని మూకలు చేశాయని స్పష్టం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు.
Dhananjaya : టాలీవుడ్‌కు మరో యంగ్ విలన్ దొరికేశాడోచ్
దేశంలో పత్రిక రంగం చాలా కీలక పాత్ర పోషిస్తోందన్న కిషన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా మీడియా కొనసాగుతోందని అన్నారు. అక్కడక్కడా కొన్ని యాజమాన్యాలు సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినా నిజం దాగదన్న ఆయన కాస్త ఆలస్యమైనా వాస్తవాలు ఏదో ఒకరోజు బయట పడతాయని అన్నారు. ఇక సబర్మతి రైలు దుర్ఘటన విషయంలో అదే జరిగింది.. ఆలస్యమైనా నిజం బయటపడిందని అన్నారు.15 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి.. ఏం చేస్తానో చూడండి.. అని కొందరు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి.. దేశం ఎటు పోతోంది అనేది కూడా ఆలోచించాలని అన్నారు.