టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. గతేడాది కే ర్యాంప్ తో సూపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం సాయి రాజేష్ డైరెక్షన్ లో చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే సుకుమార్ రైటింగ్స్ లోను మరొక సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లపై కూడా ఫోకస్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ నేపథ్యంలో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ఒక భారీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read : Salim Khan : లీలావతి ఆసుపత్రిలో చేరిన సలీం ఖాన్.. ఆందోళనలో సల్మాన్ ఖాన్ కుటుంబం
ఈ సిరీస్ ఒక పక్కా పొలిటికల్ డ్రామా నేపథ్యంతో సాగనుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచే ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భరత్ కమ్మ మార్క్ ఎమోషన్స్ మరియు పొలిటికల్ ఎలిమెంట్స్ ఈ సిరీస్‌లో హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. ఈ పొలిటికల్ వార్‌లో విలన్ పాత్రలో నటుడు వెంకటేష్ విపి నటించనున్నారు. ‘కింగ్‌డమ్’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మళయాళం నటుడు ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త తరహా కథలను ఎంచుకుంటున్న తరుణంలో, భరత్ కమ్మతో చేస్తున్న ఈ సిరీస్ లో కిరణ్ అబ్బవరం కొత్త లుక్ లో కనిపిస్తాడని టాక్.
