Site icon NTV Telugu

NaaSaami Ranga Twitter Review: ‘నా సామిరంగ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Naasaami Ranga Twitter Review

Naasaami Ranga Twitter Review

NaaSaami Ranga Movie Twitter Review: కింగ్ నాగార్జున హీరోగా, నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నా సామిరంగ’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించారు. అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌, మిర్నా మీనన్, రుక్సార్‌ థిల్లాన్‌ కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా నా సామిరంగ చిత్రం నేడు ప్రేక్షల ముందుకు వచ్చింది.

ఇప్పటికే నా సామిరంగ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి. సినిమా చూసిన, చూస్తున్న వారు తమతమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. నా సామిరంగ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘ఫస్ట్ ఆఫ్ బాగుంది. నాగార్జున సీన్స్ బాగున్నాయి’, ‘బ్లాక్ బస్టర్ బొమ్మ. సంక్రాంతి అంటే కింగే ఫైనల్ అయ్యేలా ఫిక్స్ చేశారు సర్’, ‘సంక్రాంతి బ్లాక్ బస్టర్. కింగ్ లుక్, బ్యాగ్రౌండ్ బాగున్నాయి’ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version