NTV Telugu Site icon

Viral Video: ఇంట్లోకి దూరిన 11 అడుగుల కింగ్‌ కోబ్రా.. అంత ఈజీగా ఎలా పట్టావయ్యా! వీడియో చూస్తే వణకాల్సిందే

King Cobra Viral Video

King Cobra Viral Video

Man Rescued Huge King Cobra at Home: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. జనాలను ఓ పక్క వరదలు ముంచెత్తుతుంటే.. మరోపక్క పాములు హడలెత్తిస్తున్నాయి. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో 11 అడుగుల కింగ్‌ కోబ్రా భయాందోళనలకు గురిచేసింది. అతి పొడవైన పామును చూసిన స్థానికులు వణికిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మయూర్‌భంజ్ జిల్లాలోని బరిపాడ అటవీ డివిజన్ పరిధిలోని బాంగ్రా గ్రామంలో 11 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు బాంగ్రా గ్రామంలోని ఒక ఇంట్లో భారీ కింగ్ కోబ్రా దూరింది. పామును చూసిన ఆ ఇంట్లో వారు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఇంట్లోని వారు కేకలు వేస్తూ బయటకు రాగా.. ఏమైందో అని చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చారు. ఇంట్లోని భారీ కింగ్ కోబ్రాను చూసి అందరూ షాక్ అయ్యారు.

Also Read: Pakistan Cricket: పాపం పాకిస్తాన్.. 3 సంవత్సరాలుగా విజయం లేదు!

గ్రామస్తులు వెంటనే అటవీ అధికారులు, స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్‌ టీమ్ అక్కడికి చేరుకుని.. పామును పట్టే ప్రయత్నం చేశారు. అయితే అది బుసలు కొడుతూ కాటేసేందుకు మీదకు దూసుకొచ్చింది. అయినా భయపడని స్నేక్ క్యాచర్‌.. కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం దానిని సమీప అడవిలో వదలేశారు. అటవీ అధికారి శ్రీకాంత మొహంతి మాట్లాడుతూ.. ఉడుమును తరుముకుంటూ పాము ఇంట్లోకి వచ్చిందన్నాడు. కింగ్‌ కోబ్రా 11 అడుగుల పొడవు, 6.7 కిలోల బరువు ఉన్నట్టుగా తెలిపాడు.

Show comments