Site icon NTV Telugu

Snake: టమాటాలకు కాపలాగా స్నేక్ రాజా.. ట్రెండ్ మారింది గురూ

King Cobra Protecting Tomato Todays Viral Video

King Cobra Protecting Tomato Todays Viral Video

Snake: ప్రస్తుతం టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలోని పలు మెట్రో నగరాల్లో టమాటా ధర 150 నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. టమాటాలపై చాలా మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధరల పెరగుదల కారణంగా టమాటాలను సామాన్యులు తమ వంట గది నుంచి బహిష్కరించారు. ఎక్కడ చూసినా టమాటా గురించే చర్చ జరుగుతోంది. కొంతమంది దుకాణదారులు కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఒక మొబైల్ కొనుగోలు చేసిన వారికి రెండు కేజీల టమాటాలను ఉచితంగా అందజేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. అలాగే టమాటాలకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:Demontisation In America: అమెరికాలో డీమోనిటైజేషన్.. 500, 1000 నోట్లు రద్దు

ఆ షాకింగ్ వీడియోను చాలా మంది చూశారు. టమాటా నిధి కంటే తక్కువ కాదని, టమాటాకు పాము కాపలాగా ఉందని వీడియో క్రియేట్ చేసిన వ్యక్తి రాశాడు. వైరల్ అవుతున్న వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. అక్కడున్న వస్తువును పాము రక్షిస్తున్నట్లు గమనించవచ్చు. ఒక వ్యక్తి ఆ టమాటా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. ఆ సమయంలో పాము దాడి చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్‌గా మారింది.

Read Also:Virat Kohli Boundary: విరాట్ భయ్యా సెంచరీ కాలేదు ఇంకా.. నవ్వులు పూయిస్తున్న బౌండరీ వీడియో!

జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రజలు ప్రతిరోజూ మంచి వీడియోల కోసం చూస్తున్నారు. అదే సమయంలో ఈ వీడియో చూసిన తర్వాత పలు కామెంట్లు వస్తున్నాయి. వారి అభిప్రాయాలు కూడా పంచుకుంటారు. ప్రస్తుత వీడియోను ఎక్కువ మంది వ్యక్తులు వీక్షించారు.

Exit mobile version