NTV Telugu Site icon

Sritej Health Bulletin : సంధ్య థియేటర్ ఘటన.. మెరుగుపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం

Sritej

Sritej

Sritej Health Bulletin : పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చినప్పుడు అభిమానులు తోపులాట ప్రారంభించారు. అదే థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి శ్రీతేజ్ గత 14 రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్నాడు.

Read Also:Earthquake: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..

ఇటీవల కిమ్స్ వైద్యులు బాలుడి ఆరోగ్య పరిస్థితిపై కీలక సమాచారం అందించారు. చిన్నారి శ్రీతేజ్ ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఇప్పుడిప్పుడే శ్రీ తేజ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు సమాచారం. తను చికిత్సకు స్పందించి కళ్ళు తెరుస్తున్నాడని తెలుస్తోంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న అప్పటికి ఫీడింగ్ తీసుకుంటున్నాడు శ్రీతేజ్. కాళ్ళు , చేతులు కదిలిస్తూ డాక్టర్ల కు స్పందిస్తున్నాడట. తనకు ఇప్పటి వరకు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడం లేదని, వైద్యులు బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం తనకు ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు వారు వెల్లడించారు. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. ఇంతలో, బాలుడు త్వరగా కోలుకోవాలని చాలామంది ఆశిస్తున్నారు.

Read Also:GST Council Meeting: నేడు 55వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. కీలక నిర్ణయాలపై దృష్టి

Show comments