Kieron Pollard: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 (CPL 2025)లో ఆదివారం జరిగిన 23వ మ్యాచ్ ప్రొవిడెన్స్ వేదికగా గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ట్రిన్‌బాగో బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్లుగా ఉన్న కీరాన్ పొలార్డ్, డ్యారెన్ బ్రావోలు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా కీరాన్ పొలార్డ్ తన అద్భుత బ్యాటింగ్‌తో విద్వాంసం సృష్టించాడు. తాను ఎదురుకున్న 18 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సునామీతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్!
ఇక గయానా అమెజాన్ వారియర్స్ 168 పరుగుల ఛేదనని కేవలం 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్‌లో డ్వైన్ ప్రేటోరియస్ (26* రన్స్, 1 వికెట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే మోయీన్ అలీ 70.95 పాయింట్లతో క్రిక్ఇన్ఫో MVP గా నిలిచారు. గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటింగ్‌లో షై హోప్ 53 పరుగులు, షిమ్రాన్ హెట్ మేయర్ 49 పరుగులు చేసి జట్టుకు గెలుపుకు కారణమయ్యారు. అయితే, ఇన్నింగ్స్ ఆరంభంలో అమెజాన్ వారియర్స్ మోయీన్ అలీ, కీమో పాల్ లను కేవలం 14 పరుగుల వద్దే అవుట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది.
Road Accident: టస్కర్ కిందపడి జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు మృతి!
అయితే ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన షై హోప్, హెట్ మేయర్ లు ఇన్నింగ్స్ ను గదిలో పెట్టడంతో జట్టు విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా కీరాన్ పొలార్డ్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో కరేబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మూడో స్థానాన్ని సంపాదించాడు. సీపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆండ్రీ రస్సెల్ 14 బంతుల్లో, జేమీ డుమినీ 15 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు.
38 YEAR OLD KIERON POLLARD WITH A 17 BALL FIFTY IN THE CPL. 🤯pic.twitter.com/n6vL1boAOb
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2025
