Site icon NTV Telugu

Kiara Advani : కియారా అద్వానీ హ్యాండ్ బ్యాగ్ ధర అన్ని లక్షలా?

Kiara Hand Bag

Kiara Hand Bag

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ అమ్మడు ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏదోక లగ్జరీ వస్తువుతో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ ధర సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది..

కియారా తాజాగా తాజాగా ముంబై విమానాశ్రయంలో కనిపించింది. కేన్స్ పెస్టివల్ కు వెళ్తుంది.. 77వ ఎడిషన్ కోసం కియారా అద్వానీ బయలుదేరింది. ఆ సమయంలో కియారా పొడవాటి కోటు, మ్యాచింగ్ ప్యాంటు, లేత గోధుమ రంగు వెస్ట్ స్వెటర్‌తో కూడిన తెల్లటి టీ-షర్ట్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంది. ఆమె లుక్ కన్నా ఎక్కువగా ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ అందరిని తెగ ఆకట్టుకుంది.. దాని ధర కోసం ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు..

బ్రౌన్ ఫెండి పర్స్ అందరికీ తెగ నచ్చేసింది. దాని ధర అక్షరాలా 4 లక్షలని అంచనా వేస్తున్నారు. అంత సింపుల్ గా ఉండే ఆ బ్యాగ్ ధర అన్ని లక్షలా అని షాక్ అవుతున్నారు. కియారా కేన్స్ 2024 లో రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్‌లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించనుంది. ఆరుగురు మహిళలను ఒకచోట చేర్చి, వినోద రంగానికి వారు చేసిన సేవలను గుర్తించే వానిటీ ఫెయిర్ నిర్వహిస్తున్న సినిమా గాలా డిన్నర్‌లో భాగంగా కియారా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతారు.. ఇప్పటికే సినీ ప్రముఖులు కొందరు హాజరైయ్యారు..

Exit mobile version