NTV Telugu Site icon

Kia EV9: ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే.. 561 కి.మీ. జర్నీ..

Kia Ev9

Kia Ev9

Kia EV9: కియా మోటార్స్ భారత మార్కెట్లో విడుదల చేయనున్న EV9 గురించి వివరాలను వెల్లడించింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 561 కిలోమీటర్ల వరకు జర్నీ కొనసాగుతుందని ARAI ధృవీకరించింది. కియా EV9 బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్‌తో 24 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది 5 రంగులలో లభిస్తుంది. స్నో వైట్ పెర్ల్, ఓషన్ బ్లూ, పెబుల్ గ్రే, పాంథెరా మెటల్, అరోరా బ్లాక్ పెర్ల్. అలాగే 2 డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్స్ వైట్ అండ్ బ్లాక్, బ్రౌన్ అండ్ బ్లాక్ అందుబాటుకి ఉండనున్నాయి.

Srilanka : ప్రశాంతంగా కొనసాగుతున్న శ్రీలంక అధ్యక్షుడు ఎన్నికల పోలింగ్

EV9 భారతదేశంలో 6 సీట్ల లేఅవుట్‌తో GT-లైన్ ట్రిమ్‌లో మాత్రమే అందించబడుతుంది. కొలతలు గురించి మాట్లాడినట్లయితే.. దీని పొడవు 5,015mm, వెడల్పు 1,980mm, ఎత్తు 1,780mm , వీల్‌బేస్ 3,100mm గా ఉండనున్నాయి. కొత్త కియా కార్నివాల్ వలె లెగ్ సపోర్ట్, మసాజ్ ఫంక్షన్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల స్టీరింగ్ వీల్‌తో రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు పొందుతుంది. ఇది కాకుండా, చిన్న క్యూబ్ ల్యాంప్స్, డిజిటల్ ప్యాటర్న్ లైటింగ్ గ్రిల్, వర్టికల్ హెడ్‌ల్యాంప్‌లు, ‘స్టార్ మ్యాప్’ DRLలతో కూడిన ‘డిజిటల్ టైగర్ ఫేస్’ సిగ్నేచర్ సంబంధించిన డ్యూయల్ క్లస్టర్‌లు ఉంటాయి.

MLA Vishnukumar Raju: దేవుడితో పెట్టుకున్నారు.. ఆ పార్టీ మూతపడటం ఖాయం..!

ఇక ఫీచర్ల గురించి చూస్తే.., Kia EV9 డ్యూయల్ డిస్ప్లే సెటప్‌ను పొందుతుంది. ఇందులో 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అదే సైజు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్ అప్ డిస్‌ప్లే, డిజిటల్ IRVM, V2L 14-స్పీకర్ మెరిడియన్ ఆడియో సిస్టమ్, డిజిటల్ కీ, OTA అప్‌డేట్లు, 6 USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడా అమర్చబడుతుంది. ప్రయాణీకుల భద్రత కోసం ADAS లెవల్-2 ఫీచర్లు 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, VSM, ఫ్రంట్, సైడ్ అలాగే రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరాతో అందుబాటులో ఉంటాయి.

Canara Bank: కెనరా బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు.. ఏకంగా 3000 ఖాళీలు..

ఇండియా స్పెక్ EV9 99.8kWh బ్యాటరీ ప్యాక్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సెటప్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో అందించబడుతుంది. రెండు మోటార్లు 384hp శక్తిని, 700Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనితో ఈ SUV 5.3 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ కారు అక్టోబర్ 3న విడుదల కానుంది. దీని ధర రూ. 1 కోటి (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ఇది Mercedes EQE SUV, BMW iX , Audi Q8 e-tron లకు పోటీగా ఉంటుంది.

Show comments