Kia Carnival 2024 Launched in India: నాల్గవ తరం కార్నివాల్‌ను కియా ఇండియా లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.63.90 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. మూడోతరం కార్నివాల్ (35.50 లక్షలు) కంటే ఇది రెట్టింపు ధర. ఈ కారు సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అవుతుంది. ఇది 7-సీటర్‌గా లిమోసిన్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది.
నాల్గవ తరం కార్నివాల్ కోసం ఇప్పటికే 2,796 బుకింగ్‌లను వచ్చాయని కియా ధృవీకరించింది. రూ.2 లక్షల టోకెన్ అమౌంట్‌తో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లేటెస్ట్ కారు ఇన్నోవా హైక్రాస్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. మునుపటి మోడల్ కంటే ఇది మరింత హుందాగా ఉంటుంది. టైగర్ నోస్ గ్రిల్, ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 18 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ఎల్ఈడీ టెయిల్-లైట్స్ పొందుతుంది.
Also Read: BSNL Offers 2024: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఉచితంగా 24 జీబీ డేటా!
లేటెస్ట్ కియా కార్నివాల్ 12.3 ఇంచెస్ కర్వ్‌డ్ డిస్‌ప్లే, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పవర్డ్ స్లైడింగ్ రియర్ డోర్‌లను కలిగి ఉంటుంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్, ఏడీఏఎస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 441 Nm టార్క్, 193 Hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.