Kia Carens Clavis EV: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా (KIA) తన కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు Carens Clavis EV ను భారత మార్కెట్లో ఈ మధ్యనే లాంచ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ నేటి (జూలై 22) నుంచి ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 25,000 ముందస్తు చెల్లింపుతో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వేరియంట్ ఇటీవలే విడుదలైన ICE వేరియంట్ Carens Clavis ఆధారంగా తయారు చేయబడింది.
Carens Clavis EV కారు HTK+, HTX, ER HTX, ER HTX+ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియంట్ల ధరలు రూ.17.99 లక్షల నుంచి రూ.24.49 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్). ఈ ధరల శ్రేణిలో ఇది దేశంలో లభించే అత్యంత తక్కువ ధర కలిగిన 7 సీటర్ల ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. Carens Clavis EV కారు డిజైన్ పరంగా ప్రధానంగా ICE వేరియంట్ లానే ఉంటుంది. కానీ, ఎలక్ట్రిక్ వేరియంట్‌కు ప్రత్యేకంగా ఫ్రంట్ గ్రిల్‌లో చార్జింగ్ పోర్ట్, పూర్తి వెడల్పుతో LED DRLs, 17 అంగుళాల అలాయ్ వీల్స్, అండర్‌బాడీ కవర్ ఇవ్వబడింది. దీనికి 200mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇది ICE మోడల్ కంటే 5mm ఎక్కువ.
Gita Gopinath: గీతా గోపీనాథ్ సంచలన నిర్ణయం.. ఐఎంఎఫ్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
ఇది అత్యంత సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ MPVగానూ నిలుస్తోంది. ఇందులో 26.6 అంగుళాల పానోరామిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ డిజిటల్ డాష్ క్లస్టర్ + టచ్ ఇన్ఫోటైన్‌మెంట్, 90+ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, లెవల్ 2 ADAS సిస్టమ్, వైర్లెస్ ఫోన్ చార్జింగ్, పానోరామిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఒన్-టచ్ టంబుల్ 2వ రో సీట్లు, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీటు అడ్జస్ట్‌మెంట్, ఎయిర్ ప్యూరిఫైర్, యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Earthquake: హర్యానాలో భూకంపం… ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వల్ప ప్రకంపనలు
ఈ కారును రెండు బ్యాటరీ ఆప్షన్‌లలో అందిస్తున్నారు. ఇందులో 42 kWh బ్యాటరీ వేరియంట్ ఒకసారి ఫుల్ చార్జ్‌పై 404 కిమీ రేంజ్ లభిస్తుంది. ఇందులో మోటార్ పవర్ 132 BHP కాగా, 255 Nm టార్క్ ఉంటుంది. అలాగే 51.4 kWh ఎక్స్‌టెండెడ్ రేంజ్ వేరియంట్ లో 490 కిమీ రేంజ్ లభిస్తుంది. ఇందులో 169 BHP మోటార్ పవర్, 255 Nm టార్క్ లభిస్తుంది. ఇవన్నీ 4 లెవల్స్‌లో రిజెనరేటివ్ బ్రేకింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. i‑Pedal మోడ్ ద్వారా ఒక్క పేడల్‌తో డ్రైవింగ్ సులభంగా ఉంటుంది. పేడల్ షిఫ్టర్ల సహాయంతో బ్రేకింగ్ స్థాయిని యూజర్ తాను ఎంచుకునే విధంగా ఉంటుంది.
