నీటి సమస్యను తీర్చమన్న పాపానికి ఓ కేంద్ర మంత్రి భార్య.. మహిళలపై చిందులు తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో గుణ-శివపురి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. ఆయన తరుపున భార్య, కుమారుడు గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే ప్రియదర్శిని రాజే ఖుజ్రీ గ్రామానికి చేరుకున్నప్పుడు.. కొందరు మహిళలు గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఏవేవి డిమాండ్లు ఉన్నాయో.. అవన్నీ ఒక పేపరుపై రాసి ఇవ్వాలని ప్రియదర్శిని రాజే కోరారు. ఇంతలో ఒక మహిళ జోక్యం చేసుకుని మీరే రాసుకోవాలని బదులిచ్చింది. దీనిపై ప్రియదర్శిని రాజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు రాసి ఇస్తేనే మీ పని పూర్తవుతుందని.. లేదంటే పని జరగదని ఆమె సీరియస్ సర్వంతో మహిళలకు సూచించింది. ఇలా మహిళలతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న కొందరు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నీటి సమస్యను తీర్చమని అడిగితే.. కేంద్ర మంత్రి భార్య మాట్లాడే తీరు ఇలానేనా? అంటూ ధ్వజమెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి: Israel-Hamas War: “నన్ను పెళ్లి చేసుకుని, నా బిడ్డలకు తల్లిగా ఉండు”.. ఇజ్రాయిల్ యువతికి హమాస్ ఉగ్రవాది ప్రపోజల్..
ఖుజ్రీ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి సమస్య కారణంగా అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని మహిళలు వాపోతున్నారు. నీటి ట్యాంకు ఉన్నా.. అందులో నీరు లేదు. దీంతో మా సమస్యను పరిష్కరించమని ప్రయదర్శిని సింధియాను మహిళలు కోరారు. కానీ ఆమె వీరిపై చిందులు తొక్కారు. కనీసం సమస్య వినేందుకు కారులోంచి కిందకి కూడా దిగలేదు. కారులో కూర్చొనే సమాధానం ఇచ్చారు. మోడీ తనను తాను ప్రధాన్ సేవక్ అని పిలుచుకుంటారని.. అలాంటిది ప్రజలు తమ పని తాము చేసుకోవాలని ప్రియదర్శిని రాజే సింధియా ఎలా చెబుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కామెంట్లు చేస్తున్నారు.
मोदी खुद को प्रधानसेवक कहते हैं
महारानी प्रियदर्शिनी राजे सिंधिया कह रही हैं कि जनता खुद अपना काम करे
सच में जनता को अपना काम करना चाहिए
सोच समझ कर वोट करना चाहिए #PriyadarshiniRajeScindia #JyotiradityaScindia pic.twitter.com/YzdnnqRRqM
— Guru अज्ञानी (@Guru_Agyani) April 27, 2024
