Site icon NTV Telugu

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి మృతి!

Man Died In Road Accident

Man Died In Road Accident

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదలో తెలంగాణ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన ముక్కర భూపాల్‌ రెడ్డి కుమారుడు సాయిరాజీవ్‌ రెడ్డి (28) టెక్సాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఓ పార్సిల్‌ తీసుకోవడానికి కారులో విమానాశ్రయానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. సాయిరాజీవ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు.

Also Read: Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. ఎంతంటే?

ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సాయిరాజీవ్‌ రెడ్డి మరణ వార్త అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో మృతి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి భూపాల్‌ రెడ్డి సోమవారం అమెరికాకు ప్రయాణమయ్యారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌ రెడ్డికి వివాహం జరిగింది. సాయిరాజీవ్‌ సోదరి శిల్పా రెడ్డి టెక్సాస్‌లోనే నివాసం ఉంటున్నారు. భూపాల్‌ రెడ్డి కల్లూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీకి సీడీసీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version