NTV Telugu Site icon

Khairatabad Ganesh : ఈ ఏడాది మహగణపతి ఎత్తు ఎంతో తెలుసా..?

Ganesh1

Ganesh1

Khairatabad Ganesh : మన దేశంలో చాలా పండుగలు జరుగుతాయి. ఇకపోతే హిందువులకు అనేక పండుగలు ఉన్నాయి. దీపావళి, దసరా, సంక్రాంతి, రాఖీ, వినాయక చవితి ఇలా ఎన్నో. అందులోనూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక హైదరాబాద్ నగరవాసులు ఖైరతాబాద్ లోని ప్రసిద్ధ మహాగణపతిని చాలా భక్తితో పూజిస్తారు. ఖైరతాబాద్ విగ్రహ వేడుకల కమిటీ శతాబ్దాలుగా స్థాపన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా గణేశ నవరాత్రుల సమయంలో హైదరాబాద్ వచ్చిన ఎవరైనా వినాయకుడిని తప్పక దర్శించుకుంటారు. ఈ విధంగా ఖైరతాబాద్‌ లో వినాయకుని పూజలు ఈసారి మళ్లీ ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్‌లో గణేశుడిని పురస్కరించుకుని ఈరోజు భారీ ఎత్తున కళాపూజ కార్యక్రమం జరిగింది.

UP: సాక్షిగా వచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో మృతి.. ఇద్దరు పోలీసులు సస్పెండ్

గణపయ్య ఇదివరకే తన ఎత్తుకు ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. భాగ్యనగరం అంటే గణేశుడు. చాలా మందికి అన్నదానం చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తాడు. ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 7న వచ్చింది. ఇక నేడు కర్రపూజ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ధనం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే దానా నాగేందర్‌ సహకారంతో ఖైరతాబాద్‌లో ఈ ఏడాది 70 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గతేడాది కొనసాగింపుగా ఈ ఏడాది కూడా మంచిగా వినాయకునికి ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంప్రదాయం ప్రకారం కర్రపూజ నిర్వహించి విగ్రహాలను ప్రతిష్ఠించామని తెలిపారు.

World Record : ఏంటి బ్రో ఇంత ట్యాలెంట్.. డాట్ బాల్స్‌ తోనే బయపెట్టావుగా..

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు గుర్తించారు. తొలి పూజా కార్యక్రమాన్నితెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దాన నాగేందర్‌ మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయంతో 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. భక్తులకు దర్శనం కల్పించేందుకు ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతి సంవత్సరం కొత్త తరహాలో నిర్మిస్తారు. ఈ మహాగణపతిని చూసేందుకు ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. వేలాది మంది భక్తులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు మహాగణపతి ఆశీస్సులు తీసుకుంటారు.