Yash KGF Chapter 3 Update: సౌత్ ఇండియాలోని ఒక ఇండస్ట్రీలో నటుడిగా తన కెరీర్‌ను స్టార్ చేసి భారతీయ చలన చిత్రసీమలో స్టార్‌గా ఎదిగిన వ్యక్తి రాకింగ్ స్టార్ యష్. రాకీ భాయ్.. ఈ పేరు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేజీని సొంతం చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన సినిమా కేజీఎఫ్, కేజీఎఫ్ 2. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన వసూళ్ల విధ్వంసం మామూలుది కాదు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజీఎఫ్ 3పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: Asaduddin Owaisi: కాంగ్రెస్ వల్లే ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ జైలులో ఉన్నారు.. ఓవైసీ వివరణ..
ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ.. KGF 3 పక్కాగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని పేర్కొన్నాడు. “KGF 3 will happen for sure, like Promise” అని ఆయన ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు. “మేము ఈ కేజీఎఫ్ చాప్టర్ 3 సినిమా విషయంలో ఏదీ ఎన్‌క్యాష్ చేయాలని చూడటం లేదు. ప్రేక్షకులు ఇప్పటికే మాకు ఎంతో ఇచ్చారు. అందుకే దీన్ని సరైన సమయంలో, మాసివ్‌గా, ప్రేక్షకులు గర్వపడేలా తీయాలని చూస్తున్నాం. ఇది కేవలం కల్ట్ కాదు.. పండగ!” అని అన్నారు. అలాగే కేజీఎఫ్ సినిమాకు సలార్ సినిమాలకు మధ్య సంబంధం ఉందని వస్తున్న రూమర్స్‌కు కూడా ఈ ఇంటర్వ్యూలో యష్ చెక్ పెట్టాడు. ఈ రూమర్స్ కేవలం సోషల్ మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్ మాత్రమే అన్నాడు. ప్రస్తుతం తన ముందు రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిపైనే దృష్టి మొత్తం ఉందని చెప్పారు. టాక్సిక్, రామాయణ తర్వాత కరెక్ట్ టైంలో కేజీఎఫ్ 3 గురించి పక్కాగా అప్డేట్ ఇస్తామన్నారు. తాజాగా టాక్సిక్ సినిమా ట్రైలర్ జనవరి 8న యష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయ్యి, యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతుంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 200 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి దూసుకుపోతుంది.
READ ALSO: Yash Toxic Teaser: యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతున్న యష్ టాక్సిక్.. 24 గంటల్లో !
