Site icon NTV Telugu

HMDA shiva balakrishna: బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో కీలక విషయాలు..

Hmda Balakrishna

Hmda Balakrishna

HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించాడు. బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్లకు ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా పలు దఫాలుగా నగదు రూపంలో చెల్లింపులు జరిపినట్లు వెల్లడించారు. నార్సింగిలోని ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ చేశాడు.

Read Also: Bharat Ratna PV Narasimha Rao: పీవీ నరసింహారావుకి భారత రత్న.. స్వగ్రామంలో సంబరాలు

అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి బాలకృష్ణ క్లియరెన్స్ చేశాడు. నార్సింగిలోని ఎస్ఎస్వీ ప్రాజెక్ట్ అనుమతి కోసం అరవింద్ కుమార్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారని బాలకృష్ణ పేర్కొన్నాడు. రూ. 10 కోట్లలో కోటి రూపాయలను షేక్ సైదా ఇచ్చినట్లు బాలకృష్ణ తెలిపాడు. డిసెంబర్ లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు కోటి రూపాయలు చేరింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి బాలకృష్ణ కోటి రూపాయలు ఇచ్చాడు.

Read Also: Pakistan Election: ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ జోరు.. తాజా అప్‌డేట్ ఇదే!

మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం అరవింద్ కుమార్ కోటి రూపాయలు డిమాండ్ చేసాడని వెల్లడించాడు. మహేశ్వరం మండల్ మంకల్ వద్ద వర్టేక్స్ భూములకు సంబంధించిన వ్యవహరంలో అరవింద్ కుమార్ ఫేవర్ చేసాడని బాలకృష్ణ తెలిపాడు. ఫలితంగా వర్ టెక్స్ హోమ్స్ లో ఒక ప్లాట్ ను అరవింద్ కుమార్ పేరిట బహుమానం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో శివబాలకృష్ణ ఫోన్ ను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఐఏఎస్ అధికారితో చేసిన చాట్స్, కాల్ రికార్డ్స్ వివరాలను ఏసీబీ అధికారులు వెలికి తీస్తున్నారు. ఐఏఎస్ అర్వింద్ కుమార్ చెప్పిన ఫైళ్లను వెంటనే క్లియర్ చేసినట్టు స్టేట్ మెంట్ ఇచ్చారు. కస్టడీలో శివబాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను ఏసీబీ విచారించనుంది.

Exit mobile version