NTV Telugu Site icon

AP High Court: హై కోర్టు కీలక ఆదేశాలు..పిన్నెల్లి సహా ఇతర అభ్యర్థులపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

New Project (10)

New Project (10)

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జూన్ 5 ఉదయం 10 గంటల వరకు వారిపై ఏటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఏడేళ్ళ శిక్ష లోపు సెక్షన్లు నమోదు అయ్యాయని.. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడు నీ టచ్ చేయవద్దని సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు లాయర్ వాదించారు. కానీ ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం లోపు పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు ఎనిమిది పోలీస్ బృందాలు పని చేయటం సరికాదన్నారు. సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పులు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఎలా ఇస్తుందని లాయర్ ప్రశ్నించారు. పిన్నెల్లి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే కౌటింగ్ ప్రక్రియ ఎలా పర్యవేక్షణ చేస్తారన్నారు. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న వేర్వేరు రాజకీయ పార్టీల అభ్యర్థుల తరఫు ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద కూడా హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన జేసీ అస్మిత్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పిన్నెల్లి ఇతర నేతలున్నారు.

READ MORE: Treatment With Torch Lighting: విద్యుత్ నిలిచిపోవడంతో ఫోన్ లైట్స్ తో రోగులకు చికిత్స..

జూన్ 4 కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ వాదనలు వినిపించారు. వారు కౌంటింగ్ ప్రక్రియకు అందుబాటులో లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని వారు వాదించారు. పోలింగ్ తర్వాతే అల్లర్లు జరిగాయని కౌంటింగ్ సమయంలో కూడా వీళ్ళు ఉంటే మళ్ళీ ఇబ్బందని పీపీ పేర్కొన్నారు. 1950 నుంచి ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియలో ఎప్పుడు ఇబ్బందులు అల్లర్లు చెలరేగలేదని చెప్పిన పిటిషనర్ న్యాయవాదులు.. జూన్ 4 వరకు కోర్టు నుంచి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చి తదుపరి విచారణ వచ్చే నెల 5కి వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి అనుమతి ఆదేశాలు తీసుకోవటానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. వాదనలు విన్న హై కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.