NTV Telugu Site icon

GST Council Meeting: నేడు 55వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. కీలక నిర్ణయాలపై దృష్టి

Gst

Gst

GST Council Meeting: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈరోజు జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇన్ష్యూరెన్స్, లగ్జరీ ప్రోడక్ట్స్, ఇంకా వాహన రంగాలకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నేటి జీఎస్టీ కౌన్సిల్ లో మొత్తం 148 అంశాలపై చర్చ జరగనునుంది. ఇందులో ముఖ్యంగా లైఫ్, హెల్త్ ఇన్ష్యూరెన్స్ అంశం చర్చనీయాంశంగా మారనుంది. ఇక నేడు ముఖ్యంగా ఏఏ అంశాలపై చర్చ జగనుందంటే..

Also Read: Game Changer : నేడు గేమ్ ఛేంజర్ ‘డోప్’ సాంగ్ రిలీజ్.. ఏ టైంకు వస్తుందంటే ?

లైఫ్, హెల్త్ ఇన్ష్యూరెన్స్:

– టర్మ్ లైఫ్ ఇన్ష్యూరెన్స్‌పై జీఎస్టీ రద్దు చేయబడవచ్చని సూచనలు ఉన్నాయి.
– సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్ష్యూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది.
– 5 లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్ష్యూరెన్స్ ప్రీమియం తీసుకునే వారికి పెద్ద సడలింపు ఇవ్వవచ్చని అంచనా.

లగ్జరీ ప్రోడక్ట్స్:

– లగ్జరీ ప్రోడక్ట్స్‌పై జీఎస్టీ రేట్లు పెంచే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాలు:

– ఎలక్ట్రిక్ వాహనాలు, చిన్న పెట్రోల్, డీజిల్ కార్లపై జీఎస్టీ రేట్లను ప్రస్తుత 12 శాతం నుండి 18 శాతానికి పెంచే ప్రతిపాదన ఉంది.

ఎవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF):

– ATFను జీఎస్టీ శ్లాబ్‌లోకి తీసుకురావాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.

సైకిల్, ప్యాక్డ్ వాటర్:
– 20 లీటర్ల లేదా అంతకంటే ఎక్కువ ప్యాక్డ్ వాటర్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అవకాశముంది.
– సైకిళ్లపై జీఎస్టీని 12 శాతం నుండి 5 శాతం తగ్గించే అవకాశం ఉంది.

Also Read: Cricketers Retirement in 2024: ఈ ఏడాది ఇంతమంది క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పారా?

ఇక ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా సామాన్య ప్రజలపై, బీమా సేవల వినియోగదారుల, వాహన రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రత్యేకంగా, ఇన్ష్యూరెన్స్ రంగంలో జీఎస్టీ తగ్గింపు వల్ల ఎక్కువ మంది ప్రజలు బీమా పొందే అవకాశం ఉంది. జైసల్మేర్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా మార్చగలవు. పూర్తి వివరాలను కౌన్సిల్ ప్రకటన తర్వాత తెలుసుకోవచ్చు.

Show comments