Site icon NTV Telugu

TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం..

Tspsc

Tspsc

గ్రూప్-1లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న వెరిఫికేషన్ చేయనుంది. 25న రాలేని వారికి 27న అవకాశం కల్పిస్తుంది. గ్రూప్-1 సర్వీస్‌లలో స్పోర్ట్స్ రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గుర్తింపు పొందిన ఆటలు/క్రీడలలో (ఫారమ్-1), ఒక అంతర్జాతీయ పోటీ/మల్టీ నేషనల్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులు మాత్రమే గ్రూప్ – 1 పోస్టులకు క్రీడా రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేయడానికి అర్హులు.

Off The Record: ఆ మంత్రిని కలవడానికి టీడీపీ కేడర్ సతమతం అవుతుందా..?

స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ అధికారుల నుండి అందిన నివేదిక ప్రకారం.. 36 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్‌లు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచారు. వారి గ్రూప్-1 ఆన్‌లైన్ అప్లికేషన్‌లో గుర్తించబడిన ఆటలు/క్రీడలు.. అభ్యర్థుల ఒరిజినల్ ఫారమ్-I , అన్ని ఇతర సంబంధిత స్పోర్ట్స్ సర్టిఫికేట్‌లను ప్రభుత్వ క్రీడా శాఖ అధికారుల ద్వారా ధృవీకరించాలని కమిషన్ నిర్ణయించింది. రిజర్వ్ డే 2వ తేదీ తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా పెండింగ్‌లో ఉన్న పత్రాల అంగీకారం కోసం ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబడవని కమీషన్ పేర్కొంది. ఈ క్రమంలో.. అభ్యర్థులు 25వ తేదీన ఉదయం 11 గంటలకు టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయానికి రావాలని సూచించింది. ఒరిజినల్ ఫారం-1, అన్ని సంబంధిత క్రీడా ధృవపత్రాలతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రావాలని టీజీపీఎస్సీ తెలిపింది.

BJLP Meeting: అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. బీజేఎల్పీ సమావేశంలో మహేశ్వర్ రెడ్డి

Exit mobile version