NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప టీం కీలక నిర్ణయం.. ఇంకెన్నాళ్ళు?

Pushpa 2

Pushpa 2

Pushpa 2 :ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,టీజర్,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

Read Also :Pawan Kalyan : హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టనున్న పవర్ స్టార్.. ఎప్పుడంటే..?

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఈ సినిమా షూటింగ్ ఇంకా 50 రోజులు పైనే పడుతుందని సమాచారం.ప్రస్తుతం ఈ షూటింగ్ పూర్తి చేయడానికి పుష్ప టీం ఎంతగానో కష్టపడుతున్నట్లు సమాచారం.ఇంతకీ ఈ సినిమా ఆగష్టు లో రిలీజ్ అవుతుందా లేదా అని బన్నీ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో వున్నారు.తాజాగా ఈ  విషయంపై పుష్ప టీం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల మూడో వారంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే యోచనలో పుష్పా టీం ఉన్నట్లు సమాచారం.అప్పటివరకు వాయిదా వార్త కేవలం ప్రచారమే.అయితే పుష్ప 2 రావట్లేదని తెలిసి పూరి ,రామ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ను ఆరోజు ఫిక్స్ చేసారు.ఒకవేళ పుష్ప 2 అనుకున్న సమయానికే రిలీజ్ అయితే డబుల్ ఇస్మార్ట్ వాయిదా పడే ఛాన్స్ వుంది.

Show comments