NTV Telugu Site icon

Film Chamber : తెలంగాణలో థియేటర్స్ మూసివేతపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన..

Whatsapp Image 2024 05 16 At 2.05.54 Pm

Whatsapp Image 2024 05 16 At 2.05.54 Pm

Film Chamber : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడనున్నాయి.సమ్మర్ సీజన్ మొదలైన థియేటర్స్ లోకి పెద్ద సినిమాలేవీ కూడా విడుదల కాలేదు.దీనికి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం కారణంగా చెప్పవచ్చు.సంక్రాంతి సీజన్ తర్వాత సమ్మర్ సీజన్ కే అంతటి డిమాండ్ ఉంటుంది. సమ్మర్లోనే పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి.అలాగే సమ్మర్ లో స్కూల్స్ కి ,కాలేజెస్ కి సెలవులు ఇవ్వడంతో చిన్న ,పెద్ద అంతా కూడా సినిమాలు చూడటానికి థియేటర్స్ కు వస్తారు.సమ్మర్ సీజన్ లో సినిమాలకు భారీగా కలెక్షన్స్ వస్తుంటాయి.అయితే ఈ సారి సమ్మర్ సీజన్ కు ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్స్ వెలవెలబోతున్నాయి. ఈసారి సమ్మర్ లో ఐపీఎల్ తో పాటూ ఎలక్షన్స్ కూడా రావడంతో సినిమాలకి కాస్త ఇబ్బందిగా మారింది.

దీనితో స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను పోస్టుపోన్ చేసుకున్నారు.చిన్న సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన కూడా అవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి.దీనితో సింగిల్ స్క్రీన్స్ లో చిన్న సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది.మెయింటనెన్స్ ,కరెంటు బిల్లులు ఎక్కువ కావడంతో తెలంగాణా లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంతా ఓ నిర్ణయానికి వచ్చారు.తెలంగాణాలో ఓ పది రోజుల పాటూ రాష్ట్రంలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయానికి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన చేసింది.సినిమా థియేటర్స్ మూసి వేయాలని ఎగ్జిబిటర్స్ స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారని..ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ని సంప్రదించలేదని తెలిపింది.ఈ నిర్ణయం ఎగ్జిబిటర్స్ వ్యక్తిగతంగా తీసుకున్నారని దానిని ఫిల్మ్ పునరుద్ఘాటిస్తున్నట్లు ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది.

Show comments