నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమాలో కేతికా శర్మ ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. “అదిదా సర్ప్రైజ్” అంటూ దిల్ రాజు మాటలను పట్టుకుని, ఈ సాంగ్‌తో రాబిన్‌హుడ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేశారు. అయితే, ఈ సాంగ్ స్టెప్స్ విషయంలో పెద్ద దుమారమే రేగింది. అవి అసభ్యకరంగా ఉన్నాయంటూ డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌తో పాటు సినిమా టీం మీద నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఏకంగా మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేయడంతో సినిమా నుంచి ఆ స్టెప్స్ తొలగించారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..!
ఈ విషయంపై కేతికా శర్మ స్పందిస్తూ, తనకు ఇవన్నీ తెలియదని, తాను డైరెక్టర్ చెప్పినట్లే చేశానని చెప్పుకొచ్చింది. “డైరెక్టర్ ఏం చెబితే అది చేశాను. ఎందుకంటే నేను డైరెక్టర్స్ యాక్టర్‌ని. కంప్లీట్‌గా సరెండర్ అయిపోతాను. నేను ప్రాసెస్‌కి అలవాటు పడతాను. వారు చెప్పినది చేశాను, తప్ప నేను పెద్దగా ఆలోచించలేదు,” అని చెప్పింది. తాము ఆడియన్స్ కోసం ఒక ప్రోడక్ట్ సిద్ధం చేస్తామని, అది నచ్చితే ఎంత ఎంజాయ్ చేస్తారో, నచ్చకపోతే అంతే రిజెక్ట్ చేస్తారని తనకు అవగాహన ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ వివాదం గురించి, సాంగ్‌కి వచ్చిన మిక్స్‌డ్ రెస్పాన్స్ గురించి కూడా తనకు అవగాహన ఉందని ఆమె పేర్కొంది.
