NTV Telugu Site icon

Kesineni Nani: భారీ ర్యాలీతో కేశినేని నాని నామినేషన్..

Kesineni Nani

Kesineni Nani

వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు.. కుటుంబ సమేతంగా వినాయక గుడిలో ప్రత్యేక పూజలు అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. నాని ర్యాలీలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, షేక్ ఆసిఫ్, స్వామిదాస్ పాల్గొన్నారు. అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు కంటే 3 రెట్లు జగన్ అభివృద్ధి చేశారని తెలిపారు. జగన్ హయంలో రాష్ట్ర ప్రజల స్థూల ఆదాయం పెరిగింది.. బెజవాడలో పార్లమెంట్ లో 7 సీట్లు, ఎంపీ సీటు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. బెజవాడకు చంద్రబాబు రూ.100 కోట్లు కూడా అభివృద్ది కోసం ఇవ్వలేదని ఆరోపించారు.

Crystal Salt : కళ్లు ఉప్పు వాడుతున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

అమరావతిని రియల్ ఎస్టేట్ గా మార్చి అమ్ముకోవటం కోసం విజయవాడ, గుంటూరులను చంద్రబాబు నాశనం చేశారని దుయ్యబట్టారు. 2 జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి ప్రజలను చంద్రబాబు మోసం చేశాడన్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ సంస్థ.. అమరావతి అనేది ఒక పెద్ద స్కాం.. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చంద్రబాబు ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంస్కరణలు చేస్తున్నారని.. రాష్ట్రంలో పేదల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నారని కేశినేని నాని తెలిపారు. రూ.18 వేల కోట్లు హెల్త్ మీద జగన్ ఖర్చుపెట్టారన్నారు

Boy On Train Wheels: రైలు కింద చిక్కుకొని 100 కి.మీ. ప్రయాణించిన బాలుడు.. వీడియో వైరల్..

మరోవైపు.. కేశినేని చిన్నికి కేశినేని నాని కౌంటర్ వేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిది కార్పొరేటర్ స్థాయి కంటే హీనం అని విమర్శించారు. ఆయనకి 12 లేదా 14 వేల ఓట్లు మాత్రమే వస్తాయి.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్ధి కూడా విజయం మీకు లేదా మాకు మధ్యే అని చెప్పాడన్నారు. ఫలితాలు చూస్తే అతనికి 12 వేల ఓట్లు వచ్చాయని విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీకి తాళం వేస్తారని అన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీ టేక్ ఓవర్ చేసుకుంటుందని.. చంద్రబాబు ఎన్ని వందల హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు.