NTV Telugu Site icon

Kesineni Swetha: కేశినేని నాని మరో కీలక ప్రకటన.. ఇప్పుడు కేశినేని శ్వేత వంతు..

Kesineni Swetha

Kesineni Swetha

Kesineni Swetha: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి.. టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు బెజవాడ ఎంపీ కేశినేని నాని.. ముందుగా లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.. ఇక, తండ్రి బాటలోనే కుమార్తె నడుస్తోంది.. టీడీపీకి, కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత. తనకు కార్పొరేటర్ పదవి వచ్చేలా సహకరించినందుకు ముందుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలపనున్న శ్వేత.. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లి కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేయనున్నారు.. ఇక, కార్పోరేటర్ పదవికి రాజీనామా అనంతరం తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేయనున్నారట శ్వేత.

Read Also: IND vs AUS: బ్యాటర్ల వైఫల్యం.. రెండో టీ20లో భారత్‌ ఓటమి!

ఇక, విజయవాడ ఎంపీ స్థానానికి మరొకరిని ఇంఛార్జ్‌గా పెట్టేందుకు టీడీపీ సిద్ధమైన తర్వాత.. వరుసగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. తన కార్యాచరణ ప్రకటిస్తూ వస్తున్న ఎంపీ కేశినేని నాని.. తన కుమార్తె రాజీనామా వ్యవహారంపై కూడా ట్వీట్ చేశారు.. ”అందరికీ నమస్కారం 🙏🏼.. ఈ రోజు శ్వేతా ఉదయం 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది.” అని తన ఎక్స్‌ ‘(ట్వీట్‌)లో పేర్కొన్నారు కేశినేని నాని. అంతే కాదు.. ఏ ట్వీట్‌ చేసినా.. టీడీపీ అధినేత చంద్రబాబు.. లేదా చంద్రబాబు ఫోటోలను జత చేస్తూ వచ్చిన ఆయన.. తాజా ట్వీట్‌కు చంద్రబాబుతో తన కుమార్తె మాట్లాడుతున్న ఫొటోను షేర్‌ చేవారు బెజవాడ ఎంపీ కేశినేని నాని.

కేశినేని నాని తాజా ట్వీట్‌