NTV Telugu Site icon

Wayanad Landslides : వయనాడ్ ప్రమాదం.. 26మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన వ్యక్తి

New Project (14)

New Project (14)

Wayanad Landslides : కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం, వర్షాల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ మృతుల సంఖ్య 300కి చేరింది. వాయనాడ్‌లోని చాలా మంది ప్రజలు తమ ఇళ్లు, కుటుంబాలను కోల్పోయారు. హృదయాన్ని కలచివేసే విచారకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ విపత్తులో సర్వం కోల్పోయిన ఓ వ్యక్తి బాధాకరమైన కథ ఇది. వాయనాడ్‌లోని ముండక్కైలో నివసిస్తున్న 51 ఏళ్ల షౌకత్‌కు సమాచారం అందిన వెంటనే అతను ఖతార్ నుండి హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నాడు. తన కుటుంబంలోని 26మంది గల్లంతయ్యారు. ఏ ఒక్కరూ బతికే అవకాశాలు దాదాపు లేవు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. కనీసం వారి మృతదేహాలైనా దొరికితే చివరిసారిగా చూసుకుని సంతోష పడుతానని షౌకత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడంతో అది మరుభూమని తలపిస్తుంది. కన్నీటిపర్వంతం అవుతూ షౌకత్.. ‘నా సర్వస్వం పోయింది. నా సోదరుడు, అతని కుటుంబం మొత్తం కోల్పోయాము. ఇప్పటి వరకు కేవలం నాలుగు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయని తెలిపారు. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నాను అని చెప్పాడు. అది ఇప్పుడు చెత్తాచెదారంలా మారిపోయింది. నాకు ఉండడానికి స్థలం కూడా లేదు. షౌకత్ సోదరుడు, ఇతర బంధువులు అదే ప్రాంతంలో కొంత దూరంలో నివసిస్తున్నారు.

Read Also:Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న మోహన్‌లాల్‌..

వాయనాడ్ నుండి తన గ్రామమైన ముండక్కై చేరుకోవడానికి షౌకత్‌కు మూడు రోజులు పట్టింది. ఇరువాజిని నదిపై నిర్మించిన వంతెన పై కొండచరియలు విరిగిపడటమే ఇందుకు కారణం. దీంతో ముండక్కై చేరుకోవడం దాదాపు కష్టంగా మారింది. తరువాత, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడ ఒక తాడు వంతెనను నిర్మించింది. ఇది రక్షణ చర్యలను వేగవంతం చేసింది. సైనిక సైనికులు బెయిలీ వంతెనను నిర్మించారు. శుక్రవారం షౌకత్ ఈ వంతెనను దాటుకుని తన ఇంటికి వెళ్లాడు. అప్పటికి రెస్క్యూలో నిమగ్నమైన వ్యక్తులు మృతదేహాల కోసం వెతకడం ప్రారంభించారు.

కొండచరియలు విరిగిపడిన కేరళలోని వాయనాడ్ జిల్లాలో శనివారం ఐదో రోజు కూడా అన్వేషణ కొనసాగించారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు 1,300 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు, భారీ యంత్రాలు, అత్యాధునిక పరికరాలను రంగంలోకి దించారు. వాయనాడ్‌లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లలో నైపుణ్యం కలిగిన ప్రైవేట్ కంపెనీలు, వాలంటీర్లు కూడా సైన్యం, పోలీసులు, అత్యవసర ఏజెన్సీల నేతృత్వంలోని ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. కొండచరియలు విరిగిపడటంతో ముండక్కై, చురల్‌మలలోని నివాస ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రాళ్లు, చెట్లు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులను గుర్తించడం కష్టంగా మారింది.

Read Also:Jeff Bezos : 28 నెలల తర్వాత నష్టాల్లో రికార్డు క్రియేట్ చేసిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

Show comments