Kerala: భార్యకు భయపడి ఇంటి నుంచి పారిపోయిన భర్త.. విషయమేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్తలు భార్యలను హింసలు పెట్టేవారు.. కొట్టేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురు అంటున్నారు నేటి మహిళలు.. భర్తలు కొడితే తిరిగి కొడుతున్నారు భార్యలు.. చిన్న కారణానికి కూడా భార్యలు భర్తలను టార్చర్ చేస్తున్నారని చాలా మంది భార్యా భాధితులు చెబుతున్నారు.. తమ భర్తల్ని భార్యలు టార్చర్ పెడుతుంటారు. తమ చెప్పుచేతుల్లో ఆడించాలని ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ తమ మాట వినకపోతే.. చెయ్యి కూడా చేసుకుంటారు. చేతికి దొరికిన వస్తువులతో కొడుతుంటారు. లాక్డౌన్ సమయంలో వేలాదిమంది భార్య బాధితులు కోర్టుల్ని ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. భార్యలు పెడుతున్న టార్చర్ భరించలేకే.. వీళ్లు న్యాయస్థానాల్ని ఆశ్రయించారు.. మరి కొందరు ఏకంగా ఇళ్ల నుంచే పారిపోతున్నారు..
ఇలాంటి విచిత్ర ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా కేరళలోనూ ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. భార్య వేధింపులు తాళలేక.. ఒక వ్యక్తి సంవత్సరకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో కలంజూర్కు చెందిన నౌషద్ అనే వ్యక్తికి అఫ్సానా అనే మహిళతో వివాహం అయ్యింది. కొన్నాళ్ల వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. 2021 నవంబర్‌లో నౌషద్ ఒక్కసారిగా మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలీదు. భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నెలలు గడిచిపోయాయి..
Also Read
- Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
అతని తండ్రి కొడుకు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అఫ్సానా షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. తన భర్తను తానే చంపేసి, ఒక చోట మృతదేహాన్ని పాతిపెట్టానని తెలిపింది..అఫ్సానా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజే, నౌషద్ ఆచూకీ దొరికింది. అతడు ఇడుక్కి జిల్లాలోని తొడుపుళ గ్రామంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ అతడు ఒక పొలంలో కూలీగా పని చేస్తుండేవాడు. ఎందుకు ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్నావ్? అసలెందుకు భార్యని వదిలి ఆ గ్రామానికి వెళ్లావ్? అని ప్రశ్నించినప్పుడు.. తన భార్య దెబ్బకే ఇల్లు వదిలి పారిపోయానని సమాధానం ఇచ్చాడు.. తన భార్య సన్నిహితులు నన్ను కొట్టేవారు.. ఎక్కడ చంపేస్తారో అని భయంతో పారిపోయానని చెప్పుకొచ్చాడు.. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అది అసలు కథ..
తాజావార్తలు
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు