Site icon NTV Telugu

Dog Attacks: కుక్కలపై నాటకం.. ఎగబడి కరిచిన కుక్క

Untitled Design (1)

Untitled Design (1)

కేరళలోని కన్నూర్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో… ఓ కళాకారుడు వీధి కుక్కలపై అవగాహన కోసం నాటకాన్ని ప్రదర్శించాడు. నాటకం జరగుతుండగా కళాకారుడిని కుక్క వచ్చి కరిచింది. దీంతో అందరూ ఇది నాటకంలో ఓ భాగమే అనుకున్నారు కానీ.. నిజంగానే ఆ కళాకారుడిని కుక్క కరిచిందని తెలియగానే షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Read Also:Read Also:Couple Kissing in Metro:మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా మీరు.. మెట్రోలో కూడా అదే పనా..

పూర్తి వివరాల్లోకి వెళితే.. కందక్కైకి చెందిన పి రాధాకృష్ణన్, ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్, కండక్కై కృష్ణపిల్ల మెమోరియల్ లైబ్రరీలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రదర్శించబడుతున్న ‘పేకాలమ్’ అనే సోలో నాటకంలో ప్రదర్శన ఇస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాధాకృష్ణన్ పిల్లలను వీధికుక్కలు దాడి చేసే సన్నివేశాన్ని ప్రదర్శిస్తున్నాడు. మైక్రోఫోన్‌లో మొరిగే సౌండ్ ఎఫెక్ట్ ప్లే చేయబడింది. ఒక పిల్లవాడిని వీధికుక్కలు దాడి చేస్తున్నట్లు ఆ సౌండ్ వినపడుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నల్లకుక్క పరిగెత్తుకుంటూ వచ్చి కరిచింది.

Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు.

కేరళ రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల వల్ల పెరుగుతున్న ప్రమాదాన్ని రాధా కృష్ణన్ తన నాటకం ద్వారా ప్రదర్శించారు. కేరళ అంతటా వీధికుక్కల దాడులు బాగా పెరిగాయని ఆయన తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డేటా ప్రకారం, 2024లోనే 3.16 లక్షల వీధికుక్కల దాడులు నమోదయ్యాయని. అదే కాలంలో 26 రేబిస్ మరణాలు సంభవించాయని వెల్లడించారు.

Read Also:Tamilnadu: టీవీకే ‌పార్టీపై హైకోర్టు ఆగ్రహం.. ముందస్తు బెయిల్​ నో

దాదాపు 10 నిమిషాల పాటు నొప్పిని భరించి, నాటకాన్ని పూర్తి చేశారు రాధాకృష్ణన్. కుక్క కరిచినప్పటికీ రాధా కృష్ణన్ మాత్రం తన నాటకాన్ని ఆపలేదు. అసలు ఏమి జరిగిందో తెలియని ప్రేక్షకులు, కుక్క నాటకంలో భాగమని భావించారు. “ఆ కుక్క ఎంట్రీ స్క్రిప్ట్ లో ఉందని ప్రజలు భావించారు. దాదాపు 10 నిమిషాల పాటు నొప్పిని భరించి ఆయన నాటకాన్ని పూర్తి చేశారు. నాటకం పూర్తయిన వెంటనే అందరికి కుక్క నిజంగానే కరిచిందని తెలియడంతో షాక్ కు గురయ్యారు.

Exit mobile version