NTV Telugu Site icon

Kenya Floods: కెన్యాను ముంచెత్తిన వరదలు.. 38 మంది మృతి..

Kenya Floods

Kenya Floods

తాజాగా కెన్యా దేశాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో దేశంలో ఇప్పటివరకు 38 మంది మృతువాత పొందారు. గడిచిన నాలుగైదు రోజుల నుండి దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.

Also Read: UPSC Calendar: 2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..!

నదులలో నీరంతా నివాస ప్రాంతంలోకి వస్తుందడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా నది ప్రవాహక ప్రాంతాలలో అనేక ఇల్లు నీట మునగడంతో లక్షలాదిమంది నిరాశ్రులాయరని అక్కడ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి కావలసిన వసతులను ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: Zomato: ఇక మరింత ఫాస్ట్ గా ఫుడ్ డెలివరీ.. కాకపోతే ఖర్చు అవ్వుద్ది..

కొన్ని ప్రదేశంలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీనితో వారు బిక్కుబిక్కుమంటూ వర్షపు నీటిలో బతికేస్తున్నారు. దేశంలోని తీబా నదికి వరదలు రావడంతో సమీప ప్రాంతాల్లోనే అనేక ఇళ్లలోకి, అలాగే వ్యాపార సంస్థల్లోకి నీరు చేరడంతో ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదలు నేపథ్యంలో దేశంలోని అనేక రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా దేశంలో ప్రస్తుతానికి 38 మంది ప్రాణాలు కోల్పోయారని కెన్యా రెడ్ క్రాస్ సొసైటీ పరిధిలోని అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాలలో పంటలు నీటిమునగగా.. చాలా చోట్ల పశువులకు సంబంధించిన మరణాలు జరిగాయని అధికారులు తెలిపారు.