Site icon NTV Telugu

Keeway RR 300: స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. స్టైల్, స్పీడ్ కలయికతో కీవే RR 300 లాంచ్..!

Keeway Rr 300

Keeway Rr 300

Keeway RR 300: మోటో వాల్ట్ కంపెనీ తాజాగా భారత మార్కెట్‌లో Keeway RR 300 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇది గతంలో వచ్చిన K300 R మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్. ఈ బైక్ మార్కెట్‌లో TVS Apache RR 310, BMW G 310 RR, KTM RC 390 వంటి బైక్‌లతో పోటీ పడనుంది. ఇక ఈ కొత్త డిజైన్ పర్ణగా చూస్తే.. Keeway RR 300 స్పోర్టీ, అగ్రెసివ్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బూమరాంగ్ ఆకారంలో LED DRLs, ట్విన్ హెడ్ల్యాంప్ సెటప్, లేయర్డ్ ఫెయిరింగ్ డిజైన్, రేక్‌డ్ టెయిల్ సెక్షన్, ట్యాంక్ దిగువన ‘Ride Rebel’ డెకాల్ వంటివి బైక్ లుక్ ను ఎంతగానో మార్చేస్తున్నాయి.

Read Also:CM Revanth Reddy : భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు


ఈ బైక్ తెలుపు, నలుపు, ఎరుపు వంటి మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ బైక్ ట్రెలిస్ ఫ్రేమ్ పై డిజైన్ చేయబడింది. ముందుభాగంలో USD ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ పొందవచ్చు. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉండగా.. ఇందులో డ్యూయల్ ఛానెల్ ABS కూడా ఉంది. ఇక ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనున్నాయి.

Read Also:Heavy Rains: మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!

ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. Keeway RR 300లో 292cc లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 27 హెచ్‌పీ పవర్ @ 8750 rpm, 25 Nm టార్క్ @ 7000 rpm ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ తో కలిపారు. బైక్ గరిష్ఠంగా 139 km/h వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ.1.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. ఈ మిడ్ వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ను కొనాలనుకునే వినియోగదారులు ఈ నెలాఖరులోగా డెలివరీ పొందొచ్చు.

Exit mobile version