Site icon NTV Telugu

Keerthy Suresh: ఆ సినిమాలో నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్

Keerthy Suresh

Keerthy Suresh

Keerthy Suresh: కీర్తి సురేశ్‌… ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో అభిమానుల మనుసులు దోచుకున్న ఈ అందాల భామ తన కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ నెల 28న కీర్తి సురేశ్ కొత్త సినిమా ‘రివాల్వర్‌ రీటా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీర్తి సురేశ్‌ పాల్గొన్నారు. ఓ విలేకరి ‘ఎల్లమ్మ’లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా నటించట్లేదని స్పష్టం చేశారు.

READ ALSO: Commonwealth Games: 20 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్..

బుల్లితెరపై హాస్యనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన వేణు యెల్దండి.. దర్శకత్వంలో వచ్చిన చిత్రం బలగం. ఈ సినిమా వేణు యెల్దండికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఆయన తన తదుపరి సినిమాగా ‘ఎల్లమ్మ’గా ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోగా పలువురి పేర్లు వినిపించినా.. కథానాయకుడి పేరును ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. ఇటీవల కాలంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ ఎంపికయ్యారని వస్తున్న రూమర్స్‌కు తాజాగా రివాల్వర్ రీటా ప్రెస్‌మీట్‌లో కీర్తి సురేశ్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇదే ప్రెస్ మీట్ కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎప్పుడూ విభిన్న పాత్రలకే ఓటు వేసినట్లు చెప్పారు. తన కెరీర్‌లో ఎన్నెన్నో ప్రయోగాలు చేశానని, తన నట ప్రయాణం ఇప్పుడే మొదలైనట్టు అనిపిస్తోందని, ఈ జర్నీలో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. ఇప్పటి వరకూ సాగిన తన జర్నీపై ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వచ్చిన రూమర్స్‌‌పై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వచ్చిన రూమర్స్‌పై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చి.. తను నటించడం లేదని చెప్పారు. ఇక చూడాలి ఈ సినిమా మేకర్స్ ఇప్పుడైనా నటీనటుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారో లేదో అనేది.

READ ALSO: Rabri Devi Bungalow: బరాబర్ బంగ్లా ఖాళీ చేయం.. అల్టిమేటం జారీ చేసిన ఆర్జేడీ!

Exit mobile version