Keerthi Reddy : రీ ఎంట్రీ కి సిద్ధం అవుతున్న పవన్ హీరోయిన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో గతంలో స్టార్ హీరోయిన్లు గా వెండితెరపై సందడి చేసిన హీరోయిన్స్ కెరీర్ పరంగా కాస్త గ్యాప్ ఇచ్చిన వారంతా ఇప్పుడు తిరిగి రీఎంట్రీకి ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతుంది పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈ భామ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలిప్రేమ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది… ఇక అక్కినేని హీరో సుమంత్ మాజీ భార్యగా కూడా ఈ భామ అందరికి పరిచయమే.ఈ భామ చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది కీర్తి రెడ్డి. మరీ ముఖ్యంగా తొలిప్రేమ సినిమాతో ఈ భామకు భారీ క్రేజ్ లభించింది.అయితే ఈ భామ అలీ హీరోగా నటించిన గన్ షాట్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.ఈ సినిమాను ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించారు.ఆతరువాత కరుణాకరణ్ డైరెక్షన్ లో రూపొందిన తొలిప్రేమ సినిమా తో భారీ గుర్తింపు సాధించింది.
అయితే ఈసినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ గా మారుతుంది.. ఇక తిరుగులేదు అనుకున్నారంతా.. కాని అలా జరుగలేదు. తొలి ప్రేమ తరువాత కీర్తి రెడ్డి నటించిన ప్రేమించే మనసు, రావోయి చందమామ సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది కీర్తి రెడ్డి. ఆతరువాత కొన్నాళ్ళకు మహేష్ బాబు అక్కగా.. అర్జున్ సినిమాలో నటించి మెప్పించింది. కాని ఈసినిమా కూడా కీర్తి రెడ్డిని నిరాశే మిగిల్చింది.. దాంతో వెండితెరకు దూరం అయ్యింది కీర్తి రెడ్డి. తాజాగా మరోసారి వెండితెరపై మెరవబోతుందంటూ న్యూస్ వైరల్ ఒకటి బాగా వైరల్ అవుతుంది.తాజా సమాచారం ప్రకారం కీర్తి రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. తన పాత్రకు ఇంపార్టెన్స్ వున్న లీడ్ క్యారెక్టర్స్ కోసం ఎప్పటి నుంచో కీర్తి రెడ్డిని సంప్రదిస్తున్నారట డైరెక్టర్లు. కాని ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం.తాజాగా కీర్తి మనసు మార్చుకుని మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!