Keeravani : ఆ స్పీచ్ కోసం మూడు వారాలు ప్రాక్టీస్ చేసిన కీరవాణి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్లోబల్ వైడ్ గా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హాలీవుడ్ దర్శక దిగ్గజాలను సైతం ఈ మూవీ ఎంతగానో మెప్పించింది. అయితే ఈ మూవీ రిలీజై రెండేళ్లు గడుస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఎప్పుడూ వినని తెర వెనుక స్టోరీలు బయటకు వస్తూ ఉన్నాయి.ఈ మూవీ ఆస్కార్స్ గెలుస్తుందని ముందే ఫిక్సయిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మూడు వారాల ముందు నుంచే ఎలా ప్రాక్టీస్ చేశాడో డైరెక్టర్ రాజమౌళి వివరించాడు.ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లోనూ అతి పెద్ద హిట్ గా నిలిచింది. 500ల రోజులకుపైనే అవుతున్నా.. అక్కడి థియేటర్లలో ఈ సినిమా ఇంకా ఆడుతూనే ఉంది. దీంతో అక్కడి ప్రేక్షకులతో కలిసి థియేటర్లో ఈ మూవీని చూడటానికి డైరెక్టర్ రాజమౌళి వెళ్లాడు. సినిమా అయిన తర్వాత థియేటర్లోనే అక్కడి ప్రేక్షకులతో మాట్లాడారు.ఈ సందర్భంగా కీరవాణి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
“అకాడెమీ అవార్డుల సందర్భంగా మా అన్న కీరవాణి విషయంలో ఓ సరదా ఘటన జరిగింది. అతడు నాటు నాటు పాట కోసం నామినేట్ అయ్యాడు. అవార్డు గెలుస్తామన్న గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆస్కార్స్ లో మాట్లాడటానికి కేవలం 45 సెకన్ల సమయమే ఇస్తారు. అందువల్ల కీరవాణిని మూడు వారాల ముందు నుంచే స్పీచ్ ప్రాక్టీస్ చేయించాం. అతడు కాస్త లావుగా ఉంటాడు. దీంతో చెయిర్ పై నుంచి లేచి స్టేజ్ పైకి వెళ్లే సమయంలో కాస్త ఊపిరి ఆడనట్లుగా అవుతుంది. అందువల్ల మెల్లగా నడిచి వెళ్లి మాట్లాడమని చెప్పాం. అతన్ని తన చెయిర్ లో నుంచి లేచి వచ్చి మెట్లు ఉన్న వేదికపై ఎక్కి కాస్త ఊపిరి పీల్చుకొని మాట్లాడేలా మూడు వారాల పాటు మేము ప్రాక్టీస్ చేయించాం. కానీ అవార్డు అందుకునే రోజు కీరవాణి తన ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టేశాడు. అవార్డు కోసం చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు. కానీ ఎలాగోలా ఊపిరి బిగపట్టుకొని స్పీచ్ కూడా పూర్తి చేశాడు. టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటూ ఓ పాట కూడా పాడాడు. మరుసటి రోజు మేము ఇంటికి వెళ్లినప్పుడు ఈ పాటను తన కూతుళ్లలో కలిసి రిచర్డ్ కార్పెంటర్ పాడి మా అన్నకు ట్రిబ్యూట్ ఇచ్చాడు. అప్పుడే అతడు కంటతడి పెట్టాడు” అని రాజమౌళి వివరించారు.
Also Read
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!