Site icon NTV Telugu

27న హుజురాబాద్ లో కేసీఆర్ బహిరంగ సభ!

KCR

KCR

తెలంగాణ భవన్ లో కాసేపటి క్రితమే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గసమావేశం ముగిసింది. ఈ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగగా.. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామని.. ఈ నెల 27 హుజురాబాద్ లో ప్రచార సభకు తాను వస్తానని ప్రకటించారు. అలాగే… ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ ఉండాలని… మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలన్నారు.

రోజు 20 నియోజక వర్గాల తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని… ఈ సారి మనం ముందస్తుకు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉందని.. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా రెండేళ్లు ఉంది అన్ని పనులు చేసుకుందామని.. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Exit mobile version