NTV Telugu Site icon

KCR: నేడు మెదక్‌, సంగారెడ్డిలో కేసీఆర్ బస్సు యాత్ర..

Kcr

Kcr

KCR: నేడు మెదక్, సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజు కొనసాగనుంది. నర్సాపూర్, పటాన్ చెరులో జరిగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ ఇవాళ సంగారెడ్డి జిల్లాకు వెల్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రజలు, యువకులు, రైతులు భారీగా తరలివస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో బస్సు యాత్ర ముగించుకుని కేసీఆర్ మధ్యహ్నం సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. గుమ్మడిల నుంచి సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. గుమ్మడిల వద్ద పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. గుమ్మడిల నుంచి జిన్నారం మీదుగా పటాన్‌చెరు పట్టణానికి కేసీఆర్ బస్సు కొనసాగుతుంది. దారిలో ప్రజలు, రైతులు, యువత, ఇతర ప్రజాసంఘాలతో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. కేసీఆర్‌ బస్సుయాత్ర పటాన్‌చెరుకు చేరుకున్న తర్వాత సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌ వద్ద కేసీఆర్‌ రాస్తారోకో నిర్వహించనున్నారు. కేసీఆర్ రాస్తారోకోను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.

Read also: PM Modi: నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ

సుమారు 50 వేల మందితో కేసీఆర్‌ రోడ్ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తుంది. జనంతో నిండిపోతున్న రోడ్లతో పాటు కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వినేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, నాయకులు ఉన్నారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రాసాపూర్ పట్టణానికి రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షో (బస్సుయాత్ర) చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్ పట్టణంలోని ఎర్రకోట నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగనుంది. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల నుంచి పెద్దఎత్తున రోడ్‌షోకు ప్రజలను తరలించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Sanju Samson Out: అంపైర్‌తో గొడవ.. క్రీజ్‌ను వీడేందుకు ససేమిరా అన్న సంజూ శాంసన్!