NTV Telugu Site icon

KBC 1 Crore: కేబీసీలో సంచలనం.. ఎవరీ చందర్‌ ప్రకాశ్‌?! ఏకంగా ఏడు సర్జరీలు

Chander Prakash Kbc 16

Chander Prakash Kbc 16

Who Is KBC 16 1 Core Winner Chander Prakash: దేశంలో అత్యంత పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్‌పతి’. దేశం నలుమూలల నుంచి షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. షోలో పాల్గొనే వారిలో చాలామంది మేధావులు ఉన్నా.. కొంతమందిని మాత్రమే అదృష్టదేవత వరిస్తుంది. తాజా ఆ అదృష్టదేవత ఓ 22 ఏళ్ల కుర్రాడిని వరించింది. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ 16వ సీజన్‌లో చందర్‌ ప్రకాశ్‌ కోటి రూపాయలను గెలుచుకున్నాడు. దాంతో ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌గా ప్రకాశ్‌ నిలిచాడు.

సోనీ లివ్‌లో బుధవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కంటెస్టెంట్‌ చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి ప్రశ్నకు చేరుకున్నాడు. ‘ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు. కానీ శాంతి నివాసం అనే అరబిక్‌ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది’ అని అమితాబ్‌ బచ్చన్‌ ప్రశ్న అడిగారు. ఇందుకు ఆప్షన్లుగా ఎ. సోమాలియా, బి. ఒమన్‌, సి. టాంజానియా, డి. బ్రూనైలను ఇచ్చారు. ‘డబుల్ డిప్‌’ లైఫ్‌ లైన్‌ను ఉపయోగించుకున్న ప్రకాశ్‌.. ఆప్షన్‌ సిని ఎంచుకున్నాడు. టాంజానియా సరైన సమాధానం కావడంతో ప్రకాశ్‌ రూ.కోటి గెలుచుకున్నాడు.

చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి గెలిచిన వెంటనే షోలో ఉన్నవారంతా చప్పట్లతో అభినందించారు. అమితాబ్‌ బచ్చన్‌ తన సీట్లో నుంచి లేచి అతడికి కంగ్రాట్స్ చెప్పి.. హాగ్ చేసుకున్నారు. ప్రకాశ్‌ రూ.కోటితో పాటు ఓ కారును కూడా బహుమతిగా పొందాడు. ఆ తర్వాత ప్రకాశ్ రూ.7 కోట్ల ప్రశ్నకు వెళ్లాడు.ఆ ప్రశ్నకి ప్రకాశ్‌కు జవాబు తెలియకపోవడంతో పాటు లైఫ్‌లైన్లు కూడా లేకపోవడంతో షో నుంచి క్విట్‌ అయ్యాడు. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 25న సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారమైంది.

Also Read: T20 World Cup 2024: టీమిండియా మహిళా క్రికెటర్లను కలిసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!

22 ఏళ్ల చందర్‌ ప్రకాశ్ స్వస్థలం జమ్మూకశ్మీర్‌. ప్రస్తుతం అతడు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని, పేగులో పూడిక కారణంగా ఏడుసార్లు సర్జరీ చేయించుకున్నానని ప్రకాశ్ చెప్పాడు. మీ అంకితభావం మిమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చిందని అమితాబ్‌ అన్నారు. మరిన్ని ఉన్నత శ్శిఖరాలకు చేరుకోవాలని ఆకాక్షించారు.