Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లీన్ చిట్.. స్పందించిన కవిత.. కీలక వ్యాఖ్యలు

  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లీన్ చిట్
  • స్పందించిన కల్వకుంట్ల కవిత
  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చా
Kavitha Kalvakuntla

Kavitha Kalvakuntla

ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్‌మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది.

Also Read:India vs West Indies: కెప్టెన్ సూర్య చేసిన బిగ్ మిస్టెక్‌ వల్ల భారీ మూల్యం.. వర్షం పడితే భారత్ ఇంటికే..!

కవితకు క్లీన్ చీట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్. అరవింద్ కేజ్రీవాల్‌, సిసోడియాతో పాటు కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. లిక్కర్ కేసులో ఐదు నెలల పాటు కవిత జైల్లో ఉన్నారు.

Also Read:Love Marriage: మూడు రోజుల క్రితం లవ్ మ్యారేజ్.. కట్ చేస్తే.. హాస్పిటల్ బెడ్ పై..!

లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై కవిత స్పందించారు. కవిత మాట్లాడుతూ.. “నిజం గెలిచింది.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చా.. నా తల్లిదండ్రులు, అత్తామామలు మాకు అండగా నిలిచారు.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారు.. నన్ను మూడేళ్ల పాటు నానా మాటలు అన్నారు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.. రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని నిరూపితమైంది.. నాకు అండగా నిలిచిన వారిని మరిచిపోను” అంటూ కవిత భావోద్వేగానికి గురైంది.