Site icon NTV Telugu

Kavitha: “వాళ్ళిద్దరూ ఒక్కటే.. కలిసే ఉన్నారు”.. కవిత కీలక వ్యాఖ్యలు..

Kavitha

Kavitha

Kavitha: ట్యాంక్ బండ్ మీద ఇంకా కూడా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆంధ్రా వాళ్ళ విగ్రహాలు తీసేయాలి అనడం లేదు కానీ తెలంగాణ వారి విగ్రహాలు పెట్టాలన్నారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా బీసీ రిజర్వేషన్లు మాట లేదని చెప్పారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా దాట వేస్తున్నారని.. ఇప్పుడు గుంపు మేస్త్రి గుంట నక్కను విచారణకు పిలుస్తున్నారన్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటే.. వాళ్ళు కలిసే ఉన్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయమని యువత, మహిళలు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. అవసరం ఉంటే తాను ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చారు. నిన్న సికింద్రాబాద్ జిల్లా చేయమని కేటీఆర్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. పది ఏళ్ళు ఎందుకు గుర్తు కు రాలేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల టైం లోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారని నిలదీశారు. ఫోన్ టాపింగ్ విచారణ వల్ల నాలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుందని తాను అనుకోవడం లేదన్నారు.

READ MORE: Mankatha: అజిత్ ‘మంకత’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..

Exit mobile version