Kavitha: తెలంగాణ జాగృతి కార్యాలయంలో తాను చేపట్టబోయే ప్రజాయాత్ర వివరాలపై ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆమె ప్రభుత్వం, పార్టీ తన భవిష్యత్ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వంపై ఏ వర్గం కూడా సానుకూలంగా లేదన్నారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి, ప్రతిపక్షాలను వేధించే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమై ఉందని కవిత పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో అనిశ్చితి వాతావరణం నెలకొందఅని విమర్శించారు.
MLA Raja singh: ఇది కిషన్‌రెడ్డి రాజ్యం.. పార్టీలో బీసీలకు చోటు లేదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
ఇక తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటుపై మాట్లాడుతూ.. జాగృతి ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ ఆలోచనలు లేకుండానే ప్రారంభించాం. నేను బీఆర్ఎస్ లో చేరినప్పుడు మాత్రమే కేసీఆర్ ఫోటోను ఉంచాను. భౌగోళిక తెలంగాణను సాధించాం కానీ.. సామాజిక తెలంగాణ ఇంకా సాధించలేదని నేను చెప్పాను. ఆ మాటల కారణంగానే నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు అని తెలిపారు. ఇక తాను చేయబోయే యాత్ర గురించి మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కోసం అప్పుడు పోరాడాను, ఇప్పుడు కూడా పోరాడతాను. ప్రజలే నా గురువులు, అందుకే ప్రజల దగ్గరికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. హైదరాబాద్‌లో కూర్చొని జిల్లాల సమస్యలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అందుకే ప్రతి జిల్లాలో ‘జాగృతి జనం బాట’ పేరుతో రెండు రోజులపాటు యాత్ర చేస్తాను. ఈ యాత్ర నాలుగు నెలలపాటు కొనసాగుతుందని వివరించారు.
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి ఛాన్స్..!
ఇక ఆమె తండ్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. కాబట్టి ఆయన ఫోటో పెట్టుకోవడం నైతికంగా సరైంది కాదు. ఆయన నా తండ్రి. ఆయన కడుపున పుట్టడం నా అదృష్టం. కానీ, ఈ యాత్రలో ఆయన ఫోటో ఉంచడం నా నైతికతకు విరుద్ధం అని స్పష్టం చేశారు.
