NTV Telugu Site icon

Madhya Pradesh: ఖాకీల కర్కశత్వం.. మహిళ జుట్టు పట్టుకుని రోడ్డు పై ఈడ్చుకెళ్లి.. దారుణంగా కొట్టి

Katni

Katni

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో అమానుషకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో కట్ని పోలీసులు ఓ మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టడం, మరోవైపు ఆమెపై సెక్షన్ 151 కింద తనని జైల్లో పెట్టడం కనిపిస్తుంది. ఈ సంఘటన సుమారు 45రోజుల క్రితం జరిగింది. కానీ, దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జులై 6న జరిగనట్లు తెలుస్తోంది.

కౌడియ నివాసి ఛైనా బాయి భూమిలో పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ 132 కెవి ఎలక్ట్రిక్ టవర్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. అయితే మహిళ అలా చేయొద్దని నిరసన వ్యక్తం చేసింది. దీంతో జిల్లా యంత్రాంగంతో పాటు మూడు పోలీసు స్టేషన్ల పోలీసు బలగాలు స్లిమానాబాద్ కౌడియా గ్రామానికి చేరుకున్నారు. మహిళ, ఆమె కుటుంబం జిల్లా అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. అయితే పోలీసు బలగాలు మహిళను జుట్టు పట్టుకుని లాగడం, ఆమె కుటుంబ సభ్యులను కొట్టాడు. దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:Big Boss Winner: బిగ్ బాస్ విన్నర్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తనకు పరిహారం ఇవ్వకుండానే తన భూమిలో టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నిరసన తెలిపినందుకు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఇది మాత్రమే కాదు, నన్ను మరియు నా కుటుంబ సభ్యులను కూడా సెక్షన్ 151 కింద జైలుకు పంపారు. ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పినా.. కారణం లేకుండా జిల్లా యంత్రాంగం మమ్మల్ని దారుణంగా కొట్టి జైలుకు పంపి తప్పు చేసింది. ఈ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా విచారణ జరగలేదని వాపోయింది.

ఘటన పాతదేనని ఏఎస్పీ మనోజ్ కేడియా తెలిపారు. మహిళ భూమిలో టవర్‌ను ఏర్పాటు చేసేందుకు పవర్ ట్రాన్స్‌మిషన్ ద్వారా 132 కేవీ టవర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని, దీని కోసం మహిళ ఇబ్బందులకు గురి చేస్తోంది. మహిళా పోలీసులు ఆమెను పట్టుకుని 151 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. మహిళతో గొడవపై ఏఎస్పీ మాట్లాడుతూ.. వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు అధికారి ఎలాంటి గొడవ జరగలేదని చెప్పడం గమనార్హం.

Read Also:CM Jagan : రేపు విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన